డార్లింగ్ ప్రభాస్ పెళ్లెప్పుడు? `బాహుబలి` సిరీస్ అనంతరం జరగాల్సింది. కానీ ఇంతకాలం వాయిదా పడింది. ఈ వాయిదాపై కృష్ణంరాజు అసహనంగానే ఉన్నారని వార్తలు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా ఉంటుందా? అంటే అందుకు డార్లింగ్ కుటుంబం నుంచే ఆన్సర్ వచ్చింది. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి హింట్ ఇచ్చేసారు. ప్రస్తుతం డార్లింగ్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రభాస్ పెళ్లి వార్తలపై శ్యామలా దేవి స్పందిస్తూ.. ఇప్పటివరకూ వచ్చినవన్నీ గాసిప్పులే.. అవేవీ నిజాలు కావు. ప్రభాస్ దగ్గర ఎప్పుడు పెళ్లి గురించి తీసినా సినిమాల గురించి మాట్లాడేందుకే ఇష్టపడేవాడు. దానికి సరైన సమాధానం ఇచ్చేవాడు కాదు. ఏది అడిగినా ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక మాట్లాడదాం అనే వాడు. ప్రస్తుతం ఆ రెండు సినిమాలు పూర్తవుతున్నాయి కాబట్టి సాధ్యమైనంత తొందర్లోనే `పెళ్లి సంగతి` చెబుతాం.. అని వ్యాఖ్యానించారు. ప్రభాస్ కి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అని ప్రశ్నిస్తే.. మా అందరితో కలిసిపోయే అమ్మాయి కావాలి. మాది పెద్ద కుటుంబం కాబట్టి .. అందరితో కలిసిపోవాలి అని తెలిపారు. ప్రతి యేటా కృష్ణంరాజు గారు మంచి రిసార్ట్ లో గెట్ టుగదర్ ఏర్పాటు చేస్తారు. అలా మా ఇంటికి వచ్చిన ప్రతి అమ్మాయి కలిసిపోయే అమ్మాయే కుదిరారు. ప్రభాస్ కి కూడా కలిసిపోయే అమ్మాయే రావాలని కోరుకుంటున్నాం... అన్నారు.
ఇప్పటివరకూ ప్రభాస్ పళ్లి గురించి వచ్చిన గాసిప్పులు చూసి బాధ పడ్డారా? అని ప్రశ్నిస్తే అవేవీ పట్టించుకోమని అన్నారు. అవి చూసి మేం కూడా ఆస్వాధిస్తామని తెలిపారు. భీమవరం అమ్మాయితో పెళ్లి అని వార్తలు వచ్చాయి కదా!!
ప్రభాస్ ఎదుగుతుంటే కింద పడేయాలని చేసిన కుట్రనా ఇది? అని ప్రశ్నిస్తే.. అలా అనుకోవడం సరికాదని శ్యామలా దేవి అభిప్రాయ పడ్డారు. తమ అభిమాన హీరో ప్రభాస్ ఫలానా అమ్మాయిని పెళ్లాడుతున్నాడని తెలిసి అభిమానులు సంతోషిస్తే అదే మాకు ఇష్టం అని అన్నారు. ఇక టీవీ చానెళ్లు - మీడియాలో వేసే గాసిప్పులు అభిమానుల ఆనందం కోసం.. అలాగే వారి టీఆర్ పీ కోసం మాత్రమేనని అనుకుంటామని మనసులో మాటను బయటికే చెప్పేసారు. శ్యామలా దేవి మాటల్ని బట్టి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సాహో - జాన్ చిత్రాలు పూర్తయితే ప్రభాస్ పెళ్లికి టైమ్ వచ్చినట్టేనని అర్థమవుతోంది.