స్నేహం గొప్పదనాన్ని తెలియజేసే బ్యూటిఫుల్ 'కృష్ణమ్మ' టైటిల్ సాంగ్..!

Update: 2022-09-03 06:59 GMT
వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన సినిమాలు విలక్షణమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్న సత్యదేవ్.. ''కృష్ణమ్మ'' అనే సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.

'కృష్ణమ్మ' సినిమాతో వి.వి. గోపాల కృష్ణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ విపరీతమైన ఆసక్తిని కలిగించింది. ఇటీవల విడుదలైన ఇంటెన్స్ టీజర్‌ లో సత్యదేవ్‌ మాస్ అవతార్‌ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించింది.

అలానే 'ఏమంటుందో' అనే ఫస్ట్ సింగిల్‌ కూడా శ్రోతలను అలరించింది. ఈ క్రమంలో తాజాగా కృష్ణమ్మ టైటిల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. కృష్ణమ్మ ఆత్మను తెలియజేసే ఈ గీతం మంచి స్పందన తెచ్చుకుంటోంది.

'కృష్ణమ్మా కృష్ణమ్మా నీలాగే పొంగిందమ్మా నాలో సంతోషం..' అంటూ ఈ పాటలో మిత్రుల మధ్య స్నేహాన్ని ఎంతో అందంగా హృదయానికి హత్తుకునేలా చెప్పారు. కాల భైరవ దీనికి బ్యూటీఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు.

సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ పాటను చాలా అందంగా ఆలపించారు. అతని స్వరం మంత్రముగ్ధులను చేస్తుంది. గీత రచయిత అనంత శ్రీరామ్ ట్యూన్ కు తగ్గట్టుగా అర్థవంతమైన హృదయపూర్వకమైన సాహిత్యం అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్‌ వర్క్ చేశారు.

ఇందులో సత్య దేవ్ మరియు స్నేహితులతో అతని బంధాన్ని చూపించారు. ప్రధాన నటులు కలిసి కొన్ని అందమైన క్షణాలను పంచుకున్నట్లు ఈ లిరికల్ వీడియో చూపిస్తుంది. హీరోయిన్ అధిరా రాజ్ తో పాటుగా యువ నటుడు కృష్ణ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకర్షించారు.

ఓవరాల్‌ గా కృష్ణమ్మ టైటిల్ సాంగ్ ఒక మ్యాజికల్ నంబర్ గా ఇంస్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచే సాంగ్ అని చెప్పాలి. 'కృష్ణమ్మ' చిత్రంతో స‌త్య‌దేవ్ మొద‌టి సారిగా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్ష‌న్ రోల్ లో కనిపించనున్నాడు. లక్ష్మణ్ - కృష్ణ - అర్చన - నందగోపాల్ - రఘు కుంచె - తారక్ - సత్యం ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News