ఉప్పెన సినిమా లో అవకాశం వచ్చిన సమయంలో కృతి శెట్టి వయసు 16 లేదా 17 అయ్యి ఉంటుంది. ఆ సమయంలో వైష్ణవ్ తో ఉప్పెన సినిమాను చేసినందుకు గాను ఆమెకు దాదాపుగా అన్ని ఖర్చులతో పది లక్షల వరకు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే కొన్ని ఆఫర్లు వచ్చాయి. అందులో ఒక్కటి కమిట్ అయ్యింది. ఉప్పెన సక్సెస్ తర్వాత ఈ అమ్మడికి వస్తున్న ఆఫర్ల సంఖ్య భారీగానే ఉంది. ఆఫర్లు వస్తున్నా కొద్ది ఈ అమ్మడి పారితోషికం పెంచుతూనే ఉంది. ఉప్పెన సక్సెస్ అయిన వెంటనే ఒప్పుకున్న సినిమాకు గాను రూ.50 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న కృతి శెట్టి ఆ తర్వాత సినిమా సినిమాకు పెంచుతూనే ఉంది. ఇప్పుడు కృతి శెట్టి తో సినిమా చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాల్సిందే.
యంగ్ స్టార్ హీరోలతో సినిమాలకు కమిట్ అయిన ఈ అమ్మడు ఇతర భాషల నుండి కూడా ఆహ్వానం అందుకుంటుంది. ప్రస్తుతానికి పూర్తి ఫోకస్ ను తెలుగు లోనే పెట్టింది. హిందీలో ఉప్పెన రీమేక్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్ కృతి శెట్టిని కొనసాగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు లో కమిట్ అయ్యి ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి కృతికి కనీసం ఏడాది సమయం పడుతుంది. కనుక హిందీ రీమేక్ వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేకర్స్ ఒక వేళ కృతి శెట్టి కావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు. కోటికి పైగానే రీమేక్ కోసం హిందీ ఫిల్మ్ మేకర్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉంటారని సమాచారం అందుతోంది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకున్న ఉప్పెన సినిమా కృతి శెట్టి కెరీర్ ను మార్చేసింది.
ప్రస్తుతం రామ్ తో లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాను ముగించింది. ఉప్పెన విడుదలకు ముందే ఈ సినిమాను కమిట్ అయినందుకు గాను ఆ సినిమా కు రూ.20 లక్షల పారితోషికంను కృతి శెట్టి అందుకుంది. సుధీర్ బాబుతో నటిస్తున్న సినిమా కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇక నితిన్ తో ఇటీవలే మాచర్ల నియోజక వర్గం ను షురూ చేసింది. ఇక మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ బంగార్రాజు సినిమాలో కూడా కృతి శెట్టి నటిస్తోంది. అందులో నాగచైతన్య కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. బంగార్రాజు సినిమాకు గాను కృతి భారీ పారితోషికంను అందుకుంటుంది అంటున్నారు.
ఈ సినిమాల్లో రెండు మూడు సక్సెస్ అయితే కృతి శెట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోవడం ఖాయం అంటున్నారు. అప్పడు పారితోషికం మరింత పెరగనుంది. ఉప్పెన సినిమా విడుదల అయ్యి ఏడాది కూడా కాలేదు అప్పుడే కోటి రూపాయల పారితోషికంను ఈమె అందుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అంతే కాకుండా ఈమె కిట్టీలో షూటింగ్ పూర్తి అయిన సినిమాలు.. కొనసాగుతున్న సినిమాలు.. ఇంకా ప్రారంభం కాని సినిమాలు దాదాపుగా పది నుండి పన్నెండు ఉన్నట్లుగా ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత స్పీడ్ ఏంటి అమ్మడు అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.