తీన్ మార్ బ్యూటీ.. కుక్కతో ఇలా..

Update: 2022-12-21 14:30 GMT
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్దికాలంలోనే హీరోయిన్ గా చాలా వేగంగా అవకాశాలు అందుకున్న వారిలో కృతి కర్బంధా ఒకరు. ఈ బ్యూటీ అప్పట్లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. కొన్ని అవకాశాలు అదృష్టం కొద్దీ బాగానే వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎలాంటి సక్సెస్ పడలేదు.

ఇక తెలుగులో సక్సెస్ అయిన తర్వాతనే హిందీలో నిలదొక్కుకుంటున్న కాలంలో.. అమ్మడు తెలుగులో విజయాలు రాకపోయినా కూడా హిందీలో వరుస పెట్టి సినిమాలు చేసింది. తెలుగులో అయితే మొదట బోణి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఎంతగానో అట్రాక్ట్ చేసే పాత్రలో కనిపించింది.

ఆ తర్వాత భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కృతి అందంతో మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆమె గ్లామర్ డోస్ అయితే మరింత పెరిగింది.

మరి వల్గర్ గా కాకుండా అమ్మడు విభిన్నమైన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా తన పెంపుడు కుక్కతో రాణి చాలా అందంగా ఆడుకుంటూ కనిపించింది. అందులో ఆమె కాస్త గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది.

కొంత అందంగా నవ్వే సరికి ఆ ప్రేమలో ఎంతో స్వచ్ఛత ఉంది అని ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా తన ఫాలోవర్స్ కు మతిపోయేలా చేస్తుంది. బికినీ వేసిన ట్రెడిషనల్ గా చీరలో కనిపించినా కూడా అమ్మడు ఓకే తరహా క్రేజ్ అందుకుంటూ ఉంటుంది.

ఇక గత ఏడాది వరకు హిందీ సినిమాలతో ఏదో ఒక రకంగా బిజీగా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రమే కాస్త ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు అయితే లేవు. కమర్షియల్ యాడ్స్ తో అప్పుడప్పుడు కనిపిస్తోంది. ఇక మంచి అవకాశాలు వస్తే మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవ్వాలని అనుకుంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News