మన బ్రూస్‌ లీ అక్క‌.. ఆ బ్రూస్‌ లీ లవర్‌

Update: 2015-09-26 05:43 GMT
తీన్‌మార్ ఫేం కృతి క‌ర్భంద ప్ర‌స్తుతం రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న బ్రూస్ లీ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌ కి సోద‌రిగా న‌టిస్తోంది అమ్మ‌డు.  బాబాయ్ ప‌వ‌న్ నాయిక‌గా పాపుల‌రైన ఈ భామ చ‌ర‌ణ్‌ కి మాత్రం సోద‌రిగా న‌టించ‌డం పెద్ద టాపిక్ అయ్యింది. బ్రూస్ లీ యాక్ష‌న్ సినిమా. చ‌ర‌ణ్ బ్రూస్‌లీ అభిమానిగా క‌నిపించ‌నున్నాడు. సినిమా హీరోల‌కు బాడీ డ‌బుల్ ఆర్టిస్టుగా కొత్త అవ‌తారంలో చ‌ర‌ణ్ మ్యాజిక్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈలోగానే బ్రూస్ లీ టైటిల్ కోలీవుడ్‌ లో హాట్ టాపిక్‌.. డీటెయిల్స్‌ లోకి వెళితే..

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కం హీరో జీవీ ప్ర‌కాష్ హీరోగా  కోలీవుడ్‌ లో బ్రూస్ లీ టైటిల్‌ తో మ‌రో ఇంట్రెస్టింగ్ సినిమా కోలీవుడ్‌ లో తెర‌కెక్కుతోంది. మార్ష‌ల్ ఆర్ట్ష్ నేప‌థ్యంలో రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ ఇద‌ని చెబుతున్నారు. ఇందులో జీవీకి గాళ్‌ ఫ్రెండ్‌ గా కృతి న‌టిస్తోంది. కృతి ఇన్నాళ్ల కెరీర్‌ లోనే క‌నిపించ‌నంత కొత్త‌గా క‌నిపించ‌బోతోంది. పూర్తి బోల్డ్ ఎటెంప్ట్ చేస్తోంది. జీవీ న‌టించిన లేటెస్టు రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌ లో ఆనందిని త‌ర‌హా క్యారెక్ట‌ర్‌ లోనే క‌నిపించ‌బోతోంది. అలాగే జీవీ మార్ష‌ల్ విద్య‌లు నేర్చిన ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. న‌వంబ‌ర్‌ లో షూటింగ్ మొద‌లు కానుంద‌ని చెబుతున్నారు. ఈ సినిమాతో కృతి కోలీవుడ్‌ లో పాపుల‌ర్ స్టార్ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News