ఫోటో స్టోరీ: ఆ నవ్వు.. ఆ డ్రెస్సు సూపరే

Update: 2019-12-21 14:30 GMT
కృతి సనన్ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేమికులు తక్కువమందే ఉంటారు.  మహేష్ బాబు తో '1 నేనొక్కడినే'.. అక్కినేని నాగచైతన్య 'దోచేయ్' సినిమాల్లో నటించింది. అయితే టాలీవుడ్ లో పెద్దగా లక్కు కలిసి రాలేదు.  దీంతో బాలీవుడ్ లో పై ఫోకస్ చేసింది.. అక్కడ బిజీ అయిపోయింది.  ఇక సామాజిక మాధ్యమాలను ఫుల్లుగా వాడుకోవడంలో సామాజిక న్యాయం చూపిస్తుంది. అందుకే ఈ భామకు ఇన్స్టాలో 27 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

ఈమధ్య కృతి సనన్ ఒక ఫోటో షూట్ చేసింది.  ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ప్రముఖ డిజైనర్ సుకృతి గ్రోవర్ డిజైన్ చేసిన రెడ్ కలర్ గౌన్లో ఫోటోలకు సూపర్ పోజులిచ్చింది. ఈ డ్రెస్సు వెరైటీగా ఉంది. ముందు భాగం ఒక మిడ్డీ తరహాలో ఉంది. వెనక మాత్రం చాలా పొడవుగా ఉంది. చేతులకు దారాలు ఉండే పఫ్ లాంటి స్లీవ్ డిజైన్ తో డిఫరెంట్ గా కనిపిస్తోంది.  డ్రెస్ కు మ్యాచింగ్ అన్నట్టుగా పింక్ రెడ్ కలర్లు ఉన్న హీల్స్ ధరించి ఒక అంతర్జాతీయ మోడల్ లాగా పోజిచ్చింది. ఇక కృతి సనన్ నవ్వు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ స్పందన దక్కింది. "డ్రెస్ చాలా అందంగా ఉంది".. "స్టన్నింగ్ బాలీవుడ్ బేబ్".. "కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు పోతున్నావా" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.  ఇక కృతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'మిమి' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమా అద్దె గర్భం కాన్సెప్ట్ పై తెరకెక్కుతోంది. గర్భం అద్దెకు ఇచ్చిన మహిళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమా థీమ్.



Tags:    

Similar News