ప్రతిభ ఉంటే యావరేజ్ ఫిగర్ అయినా కెరీర్ బండిని నెట్టుకొచ్చేయొచ్చు అనడానికి కొందరు భామలు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తారు. అందం కంటే వైబ్రేంట్ యాటిట్యూడ్ కొందరిని లైమ్ లైట్ లో ఉంచుతుంది. హెబ్బా పటేల్ ఈ కోవకే చెందుతుంది. హెబ్బాలో అందాన్ని ట్యాలెంట్ డామినేట్ చేసింది. అందుకే ఐదారేళ్ల కెరీర్ ని ఈజీగా నడిపించేసింది. ఈ భామను పరిచయం చేసిన సుకుమార్ లెక్క ఏమిటో ఆ తర్వాత అందరికీ అర్థమైంది. స్క్రీనింగ్ టెస్టుల్లోనే సుక్కూ అంచనా వేసేస్తాడు. ఇక సుకుమార్ వల్లనే టాలీవుడ్ కి పరిచయమైన మరో భామ కృతి సనోన్ ఈ కేటగిరీనే.
కృతిని సుక్కూ ఎంపిక చేసుకున్నప్పుడు తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొన్నాడు. అయితే 1 నేనొక్కడినే రిలీజైన తర్వాత మాత్రం మహేష్ అభిమానులు అభిప్రాయం మార్చుకున్నారు. తమ ఫేవరెట్ తో పోటీపోటీగా నటించి కృతి శహభాష్ అనిపించింది. ఆ తర్వాత చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో నటించింది. కానీ ఆశించిన విజయాలు దక్కకపోవడంతో బ్యాక్ టు పెవిలియన్ అంటూ బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
అయితే అక్కడా సరైన హిట్లు లేకపోయినా.. ఈ అమ్మడి ప్రతిభకు గుర్తింపు దక్కింది. దీంతో కెరీర్ పరంగా ఏ డోఖా లేకుండా నడిపించేస్తోంది. కెరీర్ సంగతులు ఒకవైపు.. ఎఫైర్ మ్యాటర్స్ ఇంకోవైపు కృతిని నిరంతరం లైమ్ లైట్ లో ఉంచుతున్నాయి. చాలా కాలంగా ధోని ఫేం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో నిండా ప్రేమలో మునిగిన ఈ అమ్మడు ఇటీవలే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక సోషల్ మీడియాలో కృతి స్పీడ్ గురించి అసలే చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఓ మిరుమిట్లు గొలిపే డ్రెస్ లో తళుక్కున మెరిసింది. ఇదో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్. ఇందులో విరహంతో వీగిపోయే వయ్యారిభామగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది కృతి. డార్క్ గ్రీన్ క్రిస్టల్ డిజైనర్ డ్రెస్ కి తగ్గట్టే థై స్లిట్ లుక్ లో అదరగొట్టింది. ఆ రూమ్ యాంబియెన్స్ కి తగ్గట్టే ఆ లైటింగ్ స్కీమ్ ఆకట్టుకుంది.
కృతి సనోన్ తదుపరి చిత్రం మిమి కోసం ఇటీవల బరువు పెరుగుతోందిట. ఇందులో 70 కిలోల బరువుతో హెవీగానే కనిపించాలని తెలుస్తోంది. రాజస్థాన్ మాండవాలో మిమి చిత్రీకరణ సాగనుంది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి- మనోజ్ పహ్వా- సాయి తాంంకర్- సుప్రియా పాథక్ నటిస్తున్నారు. లక్ష్మణ్ ఉత్కేర్ దర్శకత్వం వహిస్తున్నారు. 2011 లో మరాఠీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న మరాఠీ ఫిలిం `మాలా ఐ వైచ్యా` ఆధారంగా తెరకెక్కుతోంది. అలాగే `హౌస్ ఫుల్ 4` తర్వాత అక్షయ్ కుమార్ సరసన యొక్క బచ్చన్ పాండేలో కూడా కృతి నటిస్తోంది. ఫర్హాద్ సామ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.