టైం సెన్స్ తెలీదంటున్న బర్త్‌ డే బేబీ

Update: 2015-07-27 12:19 GMT
కృతి సనన్ గుర్తుందా.. అదేనండీ మన ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమా హీరోయిన్. తర్వాత దోచెయ్ అంటూ నాగచైతన్య తో కలిసి హడావిడి చేసినా... ఈ మూవీ జనాల మనసు దోచుకోలేకపోయింది. ఈ పొడుగుకాళ్ల సుందరి పుట్టిన రోజు  ఇవాళ. మామూలుగానే ట్విట్టర్ పోస్టుల్లో ముందుండే ఈ అమ్మడికి... అడగనోడిదే తప్పు అన్న రేంజ్‌ లో.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తెగ సమాధానాలిచ్చేసే అలవాటుంది. సినిమాలే కాదు... ఎవరేం అడిగినా ట్వీట్ చేసి ఆన్సర్ ఇచ్చేస్తోంది

ఫ్యాన్స్ తో కృతి సనన్ షేర్ చేసుకున్నవాటిలో  కొన్ని హైలైట్స్ ఇవే.  బీచ్‌ లు, వర్షం కృతికి మహా ఇష్టం, వాన పడుతుంటే కిటికీలోంటి చూడడం ఇంకా ఇష్టమని చెప్పింది. అయితే... చలికాలమంటే మాత్రం మహా చిరాకంట. ఎండాకాలమే బాగుంటుందని చెబ్తోంది.

చాకొలేట్ ఉండే ఏ ఫుడ్ అయినా... తెగ ఇష్టంగా తినేస్తుందిట కృతి. చీజ్ కేక్, కేరమెల్ కస్టర్డ్, మూంగ్ డాల్ హల్వా... ఇలా నచ్చే స్వీట్ల జాబితా చాలా పెద్దదే ఉందంటోంది.  ఏ పనీ సరైన టైంకి చేయడం రాదని, టైం మేనేజ్మెంట్ తెలీదని చెబ్తోంది ఈ సుందరి. స్టార్ కావడంతో ఉపయోగాలేంటో కూడా చెప్పిందండోయ్. డిఫరెంట్ కేరక్టర్స్ చేయచ్చని, విపరీతంగా ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంటుందని, మనకు తెలీని ఎంతో మంది మనల్ని ఇష్టపడే ప్రొఫెషన్ ఇదేనంటోంది కృతి.

షారూక్ ఖాన్‌ లేటేస్ట్ మూవీ 'దిల్‌వాలే'లో వరుణ్ ధావన్‌ తో కృతి జత కట్టింది. ఈ సినిమా ఈ ఏడాది చివరకు రిలీజ్ కానుంది. షాహిద్ కపూర్‌ తో చేస్తున్న ఫర్జీ... 2016లో రిలీజ్ అవుతుంది. హ్యాపీ బర్త్‌డే అంటూ బెస్టాఫ్ లక్ కృతి.
Tags:    

Similar News