వన్ భామ ఉపయోగం లేదంటోంది

Update: 2017-04-23 04:29 GMT
ఇప్పుడు చాలా మంది మోడల్స్ సినీ రంగంలోకి వచ్చేస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ లో ఆరబోసిన అందాలే పెట్టుబడిగా పెట్టి.. సిల్వర్ స్క్రీన్ ని ఏలేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ గా ఉన్నవారిలో కొందరు కెరీర్ ప్రారంభంలో మోడల్స్ గా చేసిన వారే.

దీంతో యాక్టింగ్ కెరీర్ కు మోడలింగ్ తొలి మెట్టు అనుకోవడం సహజం. కానీ.. మోడలింగ్ తో యాక్టింగ్ కు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని తేల్చి పడేసింది 1 నేనొక్కడినే చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చేసిన కృతి సనోన్. 'సినిమాల్లో కెమెరా ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. అయినా సరే.. మనం దాన్ని పట్టించుకోకుండా ఫేస్ ఫీలింగ్స్ పలికించాలి. కానీ మోడలింగ్ లో అలా కాదు. కెమేరా ఫిక్సెడ్ గా ఉంటే.. ర్యాంప్ పై అటూ ఇటూ జాగ్రత్తగా నడిస్తే సరిపోతుంది. ఫోటో షూట్స్ కూడా ఇలాంటివే. కానీ యాక్టింగ్ లో మాత్రం ఆ రోల్ లో నిమగ్నమైపోయిన నటించాలి' అంటోంది కృతి సనోన్.

అయితే మోడలింగ్ నుంచి యాక్టింగ్ లోకి రావడం వల్ల ఒనగూరే ఒకే ఒక ప్రయోజనం.. కెమేరా అంటే భయం పోవడమే అని చెప్పింది కృతి. కెమేరా ఫియర్ పోవడంతో ధైర్యంగా తమ ట్యాలెంట్ ను చూపించే అవకాశం మాత్రం చిక్కుతుందట. అంతకు మించి మోడలింగ్ తో యాక్టింగ్ కు ఏ మాత్రం ఉపయోగం లేదని తేల్చేసిందీ భామ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News