ల‌వ్ రిజెక్ట్ చేసాడ‌ని స్నేహితుల‌తో కొట్టించిన న‌టి

ఆ తర్వాత జరిగిన సంఘటనపై 'బేబి జాన్' రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో వరుణ్ తాజాగా ఓపెన్ అయ్యాడు. శ్రద్ధాను రిజెక్ట్ చేయ‌డంతో ఆమె తనను సాటి కుర్రాళ్ల‌తో కొట్టించిందని, ఇది చాలా సినిమాటిక్ సన్నివేశమని అతడు వెల్లడించాడు.

Update: 2024-12-26 18:30 GMT

ఎనిమిదేళ్ల వ‌య‌సు అంటే ఇంకా ప‌రిప‌క్వ‌త లేని వ‌య‌సు. టీన్‌గా కూడా ప‌రిగ‌ణించ‌లేం. ఆ వ‌య‌సులో ప్రేమ‌, క్ర‌ష్ అంటే అది ఒక గుడ్డి న‌మ్మ‌కం. బాల బాలిక‌ల మ‌ధ్య ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా కానీ, దానిని ప్రేమ అని పొర‌బ‌డ‌టానికి కుద‌ర‌దు. కానీ ఎనిమిదేళ్ల వ‌య‌సులో ఉన్న శ్ర‌ద్ధా క‌పూర్.. త‌న స‌హ‌చ‌రుడైన వ‌రుణ్ ధావ‌న్ తో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని గ‌త‌ ఇంట‌ర్వ్యూల్లో తెలిపారు.

 

వరుణ్ ధావన్ - శ్రద్ధా కపూర్ చిన్నప్పటి నుండి స్నేహితులు. అందుకే చిన్నతనంలో తనకు ప్రపోజ్ చేశానని, అయితే అతడు తిరస్కరించాడని శ్ర‌ద్ధా గతంలో వెల్లడించింది. ఆ తర్వాత జరిగిన సంఘటనపై 'బేబి జాన్' రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో వరుణ్ తాజాగా ఓపెన్ అయ్యాడు. శ్రద్ధాను రిజెక్ట్ చేయ‌డంతో ఆమె తనను సాటి కుర్రాళ్ల‌తో కొట్టించిందని, ఇది చాలా సినిమాటిక్ సన్నివేశమని అతడు వెల్లడించాడు.

ఒక కొండ‌పైకి తీసుకెళ్లి అక్క‌డ శ్ర‌ద్ధా త‌న‌కు ప్ర‌పోజ్ చేసింద‌ట‌... కానీ వ‌రుణ్ రిజెక్ట్ చేసాడు. అప్ప‌టికి వ‌య‌సు ఎనిమిది. ఆ వయసులో ఏ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడతాడు? అని అన్నాడు. శ్రద్ధా తన పదవ బర్త్ డే పార్టీకి తనను ఆహ్వానించిందని, పార్టీలో త‌ను ఫ్రాక్ వేసుకుని ఉందని వరుణ్ గుర్తు చేసుకున్నాడు. అక్కడ ఉన్న కుర్రాళ్ల‌లో ముగ్గురు నలుగురు అప్ప‌టికే శ్ర‌ద్ధాతో ప్రేమ‌లో ఉన్నారు. కానీ శ్ర‌ద్ధా వ‌రుణ్ ని ప్రేమిస్తోంది. ఈ విష‌యం తెలుసుకుని త‌న‌ను ఎందుకు రిజెక్ట్ చేసావ్? అంటూ వారంతా వ‌రుణ్ ని అడిగార‌ట‌. అయితే త‌న‌కు అక్క‌డ జ‌రిగే డ్యాన్స్ పోటీపై మాత్రమే ఆసక్తి ఉందని, అమ్మాయిలపై ఆస‌క్తి లేద‌ని వారితో చెప్పాన‌ని వ‌రుణ్ ధావ‌న్ తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అయితే శ్ర‌ద్ధాను ప్రేమించాల‌ని వారంతా వ‌రుణ్ ని బ‌లవంతం చేసారు. అంతేకాదు వారంతా త‌న‌ను కొట్టార‌ని కూడా అత‌డు గుర్తు చేసుకున్నాడు. వాళ్లు కొట్టినందుకు ప్రతిగా వారిని కూడా తాను కొట్టాన‌ని వరుణ్ పేర్కొన్నాడు. ఇది చాలా చిత్రమైన సన్నివేశం అని అన్నాడు. తాను ఆరోజు డ్యాన్స్ పోటీలో గెలుపొందగా, శ్రద్ధ మూడవ స్థానంలో నిలిచినట్లు వ‌రుణ్ ధావ‌న్ తెలిపారు.

అలాగే శ్ర‌ద్ధాతో 15-16 వ‌య‌సులో మ‌రో అంద‌మైన ఘ‌ట‌న గురించి వ‌రుణ్ గుర్తు చేసుకున్నాడు. శ్ర‌ద్ధా స్కూల్‌లో దాండియా ఆడేందుకు వెళ్లింది. ఒకరిని దాండియా కర్రతో కొట్టి దాక్కోవడానికి ప్రయత్నించింది. శ్రద్ధ స్లో మోషన్‌లో తన వైపు నడుస్తూ అందంగా కనిపించింద‌ని కూడా గుర్తు చేసుకున్నాడు. బ‌హుశా ఎనిమిదేళ్ల వ‌య‌సులో త‌న‌కు ఓకే చెప్ప‌క త‌ప్పు చేశాన‌ని భావించాడ‌ట‌. ఆ తర్వాత మళ్లీ శ్రద్ధతో స్నేహం చేశానని వరుణ్ తెలిపాడు.

వరుణ్ ధావన్ - శ్రద్ధా కపూర్ జంట‌గా కొన్ని హిట్ చిత్రాలలో న‌టించారు. ఈ జంట అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇటీవ‌ల‌ హార్రర్ కామెడీ చిత్రం స్త్రీ 2 లో శ్ర‌ద్ధా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌రంగా వ‌రుణ్ ధావ‌న్ త‌న క్లాస్ మేట్ అయిన న‌టాషా ద‌ళాల్ ని ప్రేమించి పెళ్లాడాడు. ఆరో క్లాస్ నుంచే ఆ ఇద్ద‌రూ స్నేహితులు. అయితే శ్ర‌ద్ధాను రిజెక్ట్ చేయ‌డానికి న‌టాషా కార‌ణం కాద‌ని కూడా వ‌రుణ్ ధావ‌న్ ఈ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

Tags:    

Similar News