సంక్రాంతికి వస్తున్నాం.. కోటికి తక్కువ కాకుండా..
18 రోజుల తర్వాత కూడా సినిమాకి డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. 18 రోజుల తర్వాత కూడా సినిమాకి డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయిలో ఈ సినిమాతో నవ్వించారు. అందుకే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా 18వ రోజు కూడా కోటి రూపాయిలకి పైగా కలెక్షన్స్ సాధించింది. నిజానికి ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన సినిమాలకి మాత్రమే లాంగ్ మూడు వారల తర్వాత కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీకి 18వ రోజు 1.01 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్ కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంది.
అలాగే ఈ ఏడాది ఆరంభంలో నిర్మాత దిల్ రాజుకి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ‘గేమ్ చేంజర్’ తో వచ్చిన నష్టాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ లాభాలు సరిచేశాయనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే 18వ రోజు అత్యధిక షేర్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో ‘పుష్ప ది రూల్’ ఉంది. ఈ సినిమా 18వ రోజు 3.51 కోట్ల షేర్ వసూళ్లు చేసింది.
రెండో స్థానంలో 2.84 కోట్ల షేర్ తో ‘కల్కి 2898ఏడీ’ నిలిచింది. దీని తర్వాత మూడో స్థానంలో ‘బాహుబలి 2’ మూవీ ఉంది. ఈ చిత్రాన్ని 18వ రోజు 2.60 కోట్ల షేర్ వచ్చింది. నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా నిలవడం విశేషం. ఈ సినిమా 2.06 కోట్ల షేర్ అందుకోగలిగింది.
పుష్ప ది రూల్ – 3.51 కోట్లు
కల్కి 2898ఏడీ – 2.84 కోట్లు
బాహుబలి 2 – 2.60 కోట్లు
అత్తారింటికి దారేది – 2.06 కోట్లు
బాహుబలి – 1.45 కోట్లు
మహర్షి– 1.40 కోట్లు
దేవర పార్ట్ 1 – 1.37 కోట్లు
గీతగోవిందం – 1.34 కోట్లు
హనుమాన్ – 1.17 కోట్లు
జైలర్ (డబ్బింగ్) – 1.11 కోట్లు
రంగస్థలం– 1.06 కోట్లు
అమరన్ (డబ్బింగ్) – 1.05 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం - 1.01 కోట్లు