టెక్నాల‌జీలో రెండు ద‌శాబ్ధాల‌ వెన‌క్కి # ఆర్సీ 16!

ఆర్సీ 16 ఛాయాగ్రాహ‌కుడు రత్నవేలు పాత పద్ధతిలో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపాడు.

Update: 2025-02-02 06:30 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో గ్రామీణ క్రీడా నేప‌థ్యంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇటీవ‌లే కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్ స‌హా కీల‌క న‌టులంతా పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆర్సీ 16 ఛాయాగ్రాహ‌కుడు రత్నవేలు పాత పద్ధతిలో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపాడు.

స‌న్నివేశంలో స‌హ‌జ‌త్వం కోసం నెగ‌టివ్ రీల్ ప‌ద్ద‌తిని వినియోగిస్తున్నారుట‌. ఇది చాలా ఓల్డ్ ప‌ద్ద‌తి. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ అంతా డిజిట‌ల్ ఫార్మెట్ లోనే షూటింగ్ జ‌రుగుతోంది. కెమెరా తో క్యాప్చ‌ర్ చేసి డిజిట‌ల్ ఫార్మెట్ లో సేవ్ చేస్తున్నారు. అక్క‌డ నుంచి ల్యాబ్ తీసుకెళ్లిపోతున్నారు. దీంతో నెగిటివ్ రీల్ తో ప‌నిలేకుండా పోయింది. ఇదంతా రెండు ద‌శాబ్ధాల క్రితం నాటి సినిమా. అయితే సినిమాలో కొన్ని స‌న్నివేశాల కోసం ర‌త్న‌వేలు నెగిటివ్ రీల్ వాడుతున్నాడు.

తెర‌పై ఆ సీన్ స‌హ‌జ‌త్వం కోల్పోకూడ‌ద‌నే ఈ నిర్ణ‌యంతో ముందుకెళ్తున్న‌ట్లు తెలిపాడు. రీల్ లో స‌న్నివేశాలు షూట్ చేస్తే మ‌రింత క్వాలిటీ తో పాటు స‌హ‌జ‌త్వం ఉంటుంద‌ని అంటున్నారు. సినిమాలో ఈ స‌న్నివేశం హైలైట్ గా ఉంటుంద‌ని స‌మాచారం. కెమెరా విభాగంలో ర‌త్న‌వేలు మాస్ట‌ర్. అడ్వాన్స్ డు టెక్నాల‌జీని అందిపుచ్చుకుని సినిమాలు చేస్తుంటాడు.

అలాంటి ర‌త్న‌వేలు మ‌ళ్లీ రీల్ జోలికి వెళ్ల‌డం ఇంట్రెస్టింగ్. ఇప్పుడంతా డిజిటల్ సినిమానే. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌ని భారం త‌గ్గుతుంది. నెగిటివ్ రీల్ అన్న‌ది ఎప్పుడో అంత‌మైపోయింది. అప్ప‌ట్లో కెమెరాతో షూట్ చేసి నెగిటివ్ రీల్ లో ఉంచేవారు. దాన్ని ల్యాబ్లో ప్రోస‌స్ చేసేవారు. అనంత‌రం ఆ కంటెంట్ ని ఎడిట్ చేసేవారు. అందుకోసం నెల‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం ప‌ట్టేది. కానీ డిజిట్ ఫార్మెట్ అందుబాటులోకి వ‌చ్చాక ఆ ప‌నుల‌న్నీ వేగంగా పూర్త‌వుతున్నాయి.

Tags:    

Similar News