మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ తో రామ్ చరణ్?

ప్రస్తుతం సందీప్ రెడ్డి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' మూవీ చేయబోతున్నాడు.

Update: 2025-02-02 07:30 GMT

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' మూవీతో ఇండియాలో మోస్ట్ వైలెంట్ చిత్రాల దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు అతనికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. టి-సిరీస్ ఈ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి లైన్ అప్ లో స్టార్ హీరోలే ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కూడా మూవీస్ చేయాలని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. స్పిరిట్ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ మూవీని సందీప్ రెడ్డి వంగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. దీన్ని తర్వాత అల్లు అర్జున్ తో ఒక మూవీ కన్ఫర్మ్ అయ్యింది.

ఇక వీటి తర్వాత సందీప్ రెడ్డి లైన్ అప్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ కూడా ఉండబోతున్నాడంట. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాని రామ్ చరణ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.

ఇది కూడా 'రంగస్థలం', 'పుష్ప 2' తరహాలోనే ప్యూర్ మాస్ బొమ్మగా ఉండబోతోందని అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలతో చరణ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మూవీ ప్లానింగ్ ఉందంట. ప్రస్తుతం ఇదే చర్చ ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ చేయాలని సందీప్ రెడ్డి కూడా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

అదిరిపోయే కథతో ఈ మూవీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఈ ప్రచారం వాస్తవం అయితే మాత్రం కచ్చితంగా చరణ్ కెరియర్ లోనే అది బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అటు మెగా కాంపౌండ్, లేదంటే ఇటు సందీప్ రెడ్డి వంగా నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఇద్దరి లైన్ అప్ లు చూస్తుంటే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కనీసం 4 ఏళ్ళ పైనే పడుతుంది. సందీప్ రెడ్డి వరుసగా మూడు సినిమాలు చేయాలి. చరణ్ బుచ్చిబాబు మూవీ తర్వాత సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి కనీసం మూడేళ్ళ సమయం పట్టొచ్చని అనుకుంటున్నారు. తరువాత అన్ని సెట్ అయితే ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News