పెళ్లిపై ఆస‌క్తి లేద‌న్న స్టార్ హీరోయిన్

తాజా ఇంట‌ర్వ్యూలో ప్రేమ‌, రిలేష‌న్ షిప్, పెళ్లి ఆలోచ‌న గురించి శ్రుతిహాస‌న్ ప్ర‌స్థావించింది. ల‌వ్ లైఫ్‌, రిలేష‌న్ లో ఉన్న‌ప్ప‌టి మ‌జా పెళ్లిలో ఉంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని శ్రుతిహాస‌న్ తాజాగా వ్యాఖ్యానించారు.

Update: 2024-12-26 17:30 GMT

టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రుతిహాస‌న్. బాలీవుడ్ లోను కొన్ని హిట్ చిత్రాల్లో న‌టించింది. వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో కొంత‌కాలం కెరీర్ కి దూర‌మైనా కానీ, శ్రుతి ఇటీవ‌ల వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో కంబ్యాక్ అయిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. చిరంజీవి, బాల‌కృష్ణ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకున్న ఈ బ్యూటీ.. ర‌జ‌నీకాంత్ కూలీలోను న‌టించింది. ర‌జ‌నీ-క‌న‌గ‌రాజ్ ల‌ కూలీ 2025 మేలో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు శ్రుతిహాస‌న్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి మీడియాలో చాలా చ‌ర్చ సాగుతోంది. శ్రుతి తొలుత విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక‌, కొన్నేళ్ల పాటు డిప్రెష‌న్ తో పోరాడాన‌ని తెలిపింది. ఆ త‌ర్వాత డూడుల్ ఆర్టిస్టు శంత‌ను హ‌జారికాతోనే డేటింగ్ చేసింది. కానీ అత‌డి నుంచి కూడా ఇటీవ‌ల విడిపోవ‌డం మాన‌సికంగా త‌న‌ను దెబ్బ తీసింది.

తాజా ఇంట‌ర్వ్యూలో ప్రేమ‌, రిలేష‌న్ షిప్, పెళ్లి ఆలోచ‌న గురించి శ్రుతిహాస‌న్ ప్ర‌స్థావించింది. ల‌వ్ లైఫ్‌, రిలేష‌న్ లో ఉన్న‌ప్ప‌టి మ‌జా పెళ్లిలో ఉంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని శ్రుతిహాస‌న్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రేమ‌లో త‌ల‌మున‌క‌లుగా ఉండ‌టం చాలా బావుంటుంద‌ని తెలిపిన శ్రుతి, పెళ్లి చేసుకుని ఒక‌రితో అటాచ్ అవ్వాలంటే భ‌యం వేస్తోంది అని వెల్ల‌డించింది.

నేను అందమైన కుటుంబంలో జ‌న్మించాను. ఈ ప్ర‌పంచంలోనే అమ్మా నాన్న ఉత్త‌మ జంటి అని భావించాను. ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేసేవారు. సంతోషంగానే ఉండేవారు. స‌ర‌దాగా ఉండేది జీవితం. కానీ ఎప్పుడైతే విడిపోయారో అంతా మారిపోయింది. గొడ‌వ‌లు ప‌డుతూ క‌లిసి ఉండ‌టం కంటే విడిపోవ‌డ‌మే మేలు అనే ప‌రిస్థితి వ‌చ్చింది. అయినా క‌లిసి ఉండ‌టానికి ప్ర‌య‌త్నించారు.. కానీ కుద‌ర‌లేదు! అని శ్రుతి వెల్ల‌డించింది. క‌మ‌ల్ హాస‌న్- సారిక జంట 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శ్రుతిహాస‌న్, అక్ష‌ర హాస‌న్ అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. 2004లో క‌మ‌ల్ - సారిక విడాకులు తీసుకున్నారు. పెళ్లిపై శ్రుతి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి త‌న త‌ల్లిదండ్రుల బ్రేక‌ప్ ప్ర‌భావం త‌న‌పై తీవ్రంగా ఉంద‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News