తెలుగమ్మాయి సూపర్ లుక్స్

తెలుగమ్మాయి, హీరోయిన్ రమ్య పసుపులేటి.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.

Update: 2024-12-26 15:44 GMT

తెలుగమ్మాయి, హీరోయిన్ రమ్య పసుపులేటి.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. గ్లామర్ గేట్లు ఎత్తేసిన ముద్దుగుమ్మ.. అదిరిపోయేలా స్కిన్ షో చేస్తున్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేసే ఆమె.. రోజురోజుకు తన ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు.

మోడ్రన్ డ్రెస్సుల్లో రమ్య అందాల ఆరబోత మామూలుగా ఉండదు. చూస్తే.. అలా చూసుకుంటూ ఉండిపోవాల్సిందే. అంతలా తన గ్లామర్ తో మైమరపిస్తున్నారు అమ్మడు. వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నారు. అలా లేటెస్ట్ గా కొత్త పిక్స్ షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సింపుల్ మేకప్ తో ఉన్న రమ్య.. మూడు సెల్ఫీలు పోస్ట్ చేశారు. ఒక్కో పిక్ వేరే లెవెల్. ఆ చూపుకే ఫ్లాట్ అయ్యామని నెటిజన్లు చెబుతున్నారు. అట్రాక్ట్ అయిపోతున్నామని అంటున్నారు. పిక్స్ సెగలు రేపేలా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. లైకులు కొడుతూ.. అందాన్ని పొగుడుతూ రమ్యను ఆకాశానికేత్తెస్తున్నారు. కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.

అయితే బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రమ్య పసుపులేటి.. అనేక యాడ్స్ లో కనిపించారు. పంచాక్షరి, మహేష్ బాబు స్పైడర్ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ తర్వాత యాక్టింగ్ ఆపేసిన ఆమె.. ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెట్టారు. అనంతరం మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. హుషారు సినిమాతో హీరోయిన్ గా మారారు.

డెబ్యూ మూవీతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ రాజులో కనిపించిన రమ్య.. మోస్తరు హిట్ అందుకున్నారు. మైల్స్ ఆఫ్ లవ్ లో యాక్ట్ చేసిన అమ్మడు.. శ్రీకాంత్ లీడ్ రోల్ చేసిన చదరంగం వెబ్ సిరీస్ తో పాటు వివిధ సిరీస్ ల్లో మెప్పించారు.

రీసెంట్ గా రావు రమేష్, ఇంద్రజ జంటగా తెరకెక్కిన మారుతీ నగర్ సుబ్రమణ్యంలో నటించే ఛాన్స్ అందుకున్నారు రమ్య. అమాయకంతో పాటు కొంత తింగరితనం ఉండే రోల్ లో మెప్పించారు. ఇప్పుడు విశ్వంభరలో చిరు చెల్లెలుగా కనిపించనున్నారు. సినిమాలో మంచి స్కోప్ ఉన్న రోల్ దక్కించుకున్న ఆమె.. మూవీలో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News