మహేష్ బాబు.. సుకుమార్ ల కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆదిపురుష్ సినిమా లో సీత పాత్రను ఈమె చేస్తుంది. ఇంకా హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చానంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ... తనది ఒక సాదారణ మద్యతరగతి కుటుంబం. నాన్న చార్టెడ్ అకౌంటెంట్.. అమ్మ ప్రొఫెసర్. ఇద్దరు కూడా ఉన్నత విధ్యావంతులు అవ్వడం వల్ల నాకు ఎప్పుడు కూడా చదువుపైనే దృష్టి. సినిమాల గురించి అస్సలు ఆలోచించలేదు. కాని అనూహ్యంగా ఆఫర్ రావడంతో చేశాను. నేను సినిమాల్లో నటిస్తున్న సమయంలో కూడా ఈ స్థాయికి వస్తానని.. ఈ పరిస్థితుల్లో ఉంటాను అంటూ ఊహించలేదు. నేను ఆనందంగా ఉండేందుకు నటన దోహద పడుతుందని గుర్తించాను. అందుకే ఇందులోనే కొనసాగుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ లో కృతి సనన్ మొదట్లో ఆశించిన స్థాయిలో ఆఫర్లను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఇండస్ట్రీలోనే ఉంటూ ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి. మెల్లగా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. తనకు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కొత్తలో అందరిలాగే చాలా సమస్యలు ఎదురయ్యయాంటూ చెప్పుకొచ్చింది.