అల సామజవరగమన స్థాయి మరింత పెరిగింది

Update: 2020-01-21 09:12 GMT
సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్‌ ను దక్కించుకుంది. అయితే సినిమా సక్సెస్‌ అవ్వడానికి ముందే సామజవరగమన పాట ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌ లో సౌత్‌ ఇండియా రికార్డులను బద్దలు కొడుతూ ఆ పాట దక్కించుకున్న వ్యూస్‌ సినిమా విజయం లో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాటపై తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించాడు. ఆయన స్పందనతో ఆ పాట స్థాయి మరింత గా పెరిగినట్లయ్యిందని థమన్‌ అన్నాడు.

దావోస్‌ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ స్విస్‌ లో ఉదయం 3.30 గంటలు అయిన సమయంలో విమానం ఆలస్యం అవ్వడంతో పాటలు విన్నాడట. ఆ సమయం లో అల వైకుంఠపురంలో చిత్రంలోని సామజవరగమన పాటను విన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ పాట నా మనసుకు హత్తుకుంది. దీంతో నిన్ను నువ్వు మించి పోయావు అంటూ థమన్‌ ను ట్విట్టర్‌ లో ట్యాగ్‌ చేసి అభినందించాడు. దానికి స్పందించిన థమన్‌ మీరు మా పాట గురించి స్పందించడం అది కూడా ఇంత పాజిటివ్‌ గా స్పందించడం చాలా సంతోసంగా ఉంది. ఇప్పుడు ఈ పాట స్థాయి మా మాటలతో మరింత పెరిగిందని థమన్‌ కృతజ్ఞతలు తెలియ జేశాడు.

అల వైకుంఠపురంలోని సామజవరగమన మరియు రాములో రాముల పాటలు ఆన్‌ లైన్‌ లో రికార్డులు బద్దలు కొట్టాయి. బుట్టబొమ్మతో పాటు ఇతర పాటలు కూడా ఆకట్టుకున్నాయి. మొత్తంగా అల వైకుంఠపురంలో సినిమాలోని అన్ని పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ ను థమన్‌ కు ఇస్తున్నట్లుగా దర్శకుడు త్రివిక్రమ్‌ మరియు అల్లు అర్జున్‌ లు సక్సెస్‌ వేడుకలో చెప్పిన విషయం తెల్సిందే.


Tags:    

Similar News