టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా ఏ మాత్రం వీలున్నా సినిమాలు చూస్తుంటారు. తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయం చెపుతుంటారు. అంతెందుకు కంచె లాంటి సినిమాను రిలీజ్ అయిన చాలా నెలలకు టీవీలో చూసి మరీ ఆ సినిమా తన మనస్సును తాకిందని ప్రశంసించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ - మహేష్ బాబు సినిమాలను గతంలో చూసి వాటిని ప్రశంసించారు. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా చూసిన కేటీఆర్ ఆ సినిమాపై తన రివ్యూ ఇచ్చేశారు.
సాహో సినిమా టెక్నికల్ గా చాలా అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ ప్రీ టైం దొరకడంతో ఒకే రోజు రెండు సినిమాలు చూశారు. ఆ రెండు సినిమాలు సాహో - ఎవరు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ సినిమాలపై రివ్యూలాంటి తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు కేటీఆర్. ఈ రెండు సినిమాలు అద్భుతంగా ఉన్నాయన్న ఆయన సాహో టెక్నికల్ గా సూపర్బ్ గా ఉందని.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు.
సాహో హీరో ప్రభాస్ తో పాటు దర్శకుడు సుజిత్ కు అభినందనలు తెలిపారు. ఇక ఎవరు గురించి ఆయన స్పందిస్తూ ఎవరు స్క్రీన్ ప్లే చాలా బ్రిలియంట్ గా... గ్రిప్పింగ్ గా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా హీరో అడివి శేష్ - రెజీనా కసాండ్రా - నవీన్ చంద్ర అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారని అన్నారు కేటీఆర్. ఇక ఎవరు ఆల్రెడీ రెండు వారాల క్రితమే రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా.. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సాహోను కూడా కేటీఆర్ ప్రశంసించడం విశేషమే.
ఇక సాహో నెగిటివ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే సాహో ఏకంగా రూ.206 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.