సెంటిమెంటు పరిశ్రమ మనది! హిట్టును నమ్మే .. హిట్టు వెంటపడే పరిశ్రమ ఇది. అందుకే ఇక్కడ ఏదైనా సెంటిమెంటు వర్కవుటైంది అంటే .. దానినే పదే పదే ఫాలో చేసేస్తుంటారు. నా ఆడియోలకు బన్ని వస్తే సినిమాలన్నీ హిట్లే అంటూ దేవరకొండ ఆ సెంటిమెంటును ఫాలో అయ్యాడు. ఇలా ఎందరో హీరోలు పాటించారు. అయితే అదే సెంటిమెంటును చరణ్ కూడా పాటించారా? `ధృవ` ఆడియో-ప్రీరిలీజ్ ఈవెంట్ కి తన ఫ్రెండు కేటీఆర్ రావడం వల్లనే హిట్ కొట్టింది కాబట్టి ఈసారి కూడా అదే సెంటిమెంటుతో వీవీఆర్ వేడుకకు పిలిచారా? లేక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో మాంచి జోష్ లో ఉన్న కేటీఆర్ కి శుభాకాంక్షలు చెప్పేందుకే చరణ్ పిలిచారా? అంటూ తెరాస వర్గాలు సహా మెగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
మెగాపవర్ స్టార్ `వినయ విధేయ రామ` ఈవెంట్ లో కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. విజనరీ లీడర్.. ప్రజా సేవకుడు! అంటూ చరణ్ పొగిడేస్తే - మెగాస్టార్ చిరంజీవి `డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ కేటీఆర్` అంటూ పొగిడేశారు. ఇక మెగా హీరోలను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి అంతే గొప్ప గా ప్రశంసించారు. కేటీఆర్ మాట్లాడుతూ-`` తెలుగు సినీపరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే స్వయంకృషితో ఎదిగిన హీరో చిరంజీవిగారు. సముద్రమంతా అభిమానాన్ని - అద్భుతమైన వారసులను ఇండస్ట్రీకి అందించారు. సోదరుడు చరణ్ ధృవ సినిమా గురించి ఇదే వేదికపై మాట్లాడాను. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది`` అని అన్నారు. ఆయన అన్న ఆ మాటకు మెగాభిమానులంతా ఫుల్ ఖుషీ అయిపోయారు. ఫ్రెండు కేటీఆర్ వచ్చారు కాబట్టి వీవీఆర్ అంతే పెద్ద హిట్టవుతుందన్న ముచ్చటా మెగాభిమానుల్లో సాగింది.
``రంగస్థలం సినిమాను చరణ్ చేస్తున్నప్పుడు చరణ్ గడ్డం పెంచుకున్నాడు. ఓసారి తనను బయట కలుసుకున్నాను. ఏ సినిమా చేస్తున్నావని అడిగాను. తను గ్రామీణ నేపథ్యంలో సినిమా చేస్తున్నానని చెప్పాడు. చరణ్ నాకు అర్బన్ బోయ్ గానే తెలుసు. కాబట్టి నేను ఆ సినిమా చూడనని చెప్పాను. కానీ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని, గొప్పగా ఉందని స్నేహితులంతా చెబితే సినిమా చూశాను. చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా రంగస్థలం నిలిచింది. ఆ సినిమాలోని ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా? అనే పాటను నేను ఎలక్షన్ టైంలో కూడా ఉపయోగించుకున్నాను. దేవీశ్రీ మ్యూజిక్ చాలా బావుంది.. అంటూ వేదికపై కేటీఆర్ తన ఫ్రెండు చరణ్ ని గొప్పగా ప్రశంసించారు. నేనొచ్చాను కాబట్టి హిట్టే అన్నారు కాబట్టి, చరణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడుతుందంటారా?