కె.టి. రామారావు.. తెలంగాణ ఐటీ మంత్రి.. అంతే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడిగా ప్రభుత్వంలోను.. పార్టీలోను అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు. ఇటు మంత్రిగా రాష్ట్రం మొత్తానికి తన సేవలు అందిస్తూనే.. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సంబంధించిన పనులు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి ఇంత బిజీగా ఉండే ఈ రాజకీయ నాయకుడు.. సినిమాలకు కూడా వీలైనంతగా కేటాయిస్తుండడం విశేషం.
సినిమా ఫంక్షన్స్ కు అతిథిగా రావడం.. సినిమా రంగ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం ఓ ఎత్తయితే.. తనే స్వయంగా సినిమాలు చూసి.. వాటికి ట్వీట్స్ పెడుతుండడం మరో ఎత్తు. ఈ మధ్య కాలంలో అయితే.. అర్జున్ రెడ్డి.. ఫిదా.. నిన్ను కోరి.. బాహుబలి.. కాటమరాయుడు.. పెళ్లి చూపులు.. ఇలా అనేక చిత్రాలకు కేటీఆర్ నుంచి కామెంట్స్ వచ్చాయి. సినిమా రంగంలో అనేక మందితో సెలబ్రిటీలు ఆయనతో నేరుగా టచ్ లో ఉంటారు. నిన్ను కోరి చిత్రం చూసిన కేటీఆర్.. తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మరో రెండు స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయాలని కోరారట. అయితే.. అందరితో కలిసి సినిమా చూసేందుకు కూడా ఆయన ఏ మాత్రం సందేహించరు.
కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యం చిత్రానికి ఇలాగే పబ్లిక్ షోకి అటెండ్ అయ్యారు కేటీఆర్. తాను ఓ పవర్ ఫుల్ పర్సన్ అనే విధంగా కేటీఆర్ ప్రవర్తించరని.. ఎప్పుడూ డౌట్ టు ఎర్త్ బిహేవియర్ ఆయన సొంతమని అని ఓ నిర్మాత చెప్పడం విశేషం. సినిమా రంగంపై 28 శాతం జీఎస్టీ నిర్ణయం తీసుకున్నపుడు.. కేంద్ర ఆర్థిక మంత్రితో సినిమా రంగానికి చెందిన ప్రతినిధులతో భేటీకి ఎంతో సహాయం చేశారు కేటీఆర్.