నిజంగానే ఎక్కువమంది అబ్బాయిలను ఒక సమస్య వేధిస్తుంటుంది. ఒకమ్మాయికి లైన్ వేసి లైన్లో పెట్టేసి ఐ లవ్ యు అని చెప్పేశాక.. అన్ని ముద్దులూ కానిచ్చేశాక.. హద్దులు మీరేశాక.. ఈమెకు నేనే ఫస్టా అనే సందేహం వస్తుంటుంది. అయితే ఇలాంటి సందేహాల మీద ఎవ్వరూ సినిమాలు తీయరు. ఎందుకంటే గీత దాటితే సినిమా కాస్తా వల్గర్ గా తయారవుతుంది. సరిగ్గా ఇలాంటి పాయింటే ఎత్తుకున్నాడు మన దర్శకుడు సుకుమార్. చకచకా ఒక సినిమా స్టోరీ రాసేసి.. వెంటనే తన అసిస్టెంటు చేతిలో పేట్టేశాడు. కట్ చేస్తే.. అదే 'కుమారి 21 ఎఫ్'.
ఈ సినిమా ట్రైలర్ లోనే తాను చెప్పబోయే ఆ 'అనుమానం పెనుభూతం' కథను కరెక్టుగా చెప్పేశాడు సుక్కూ. దర్శకుడు సూర్య ప్రతాప్ కూడా చాలా గ్రిప్పింగ్ గానే ప్రతీ సీన్ ను తీసినట్లు అనిపిస్తోంది. ఇకపోతే రాజ్ తరుణ్ యాజూజువల్ క్యూట్ గా కుమ్మేస్తే.. కొత్తమ్మాయ్ హీబా పటేల్ దంచేసింది. అమ్మడు స్ర్కీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. ఈ కొత్త పాయింట్ ను అందంగా తెరకెక్కించడానికి రత్నవేలు సూపర్బ్ పాత్ర పోషించాడు. మనోడి కెమెరా దృశ్య కావ్యాన్ని క్రియేట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ కొట్టిన పాటలూ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరాయి. మొత్తంగా ఒక కొత్త పాయింటుతో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాత అవతారం ఎత్తుతున్నాడు.