కుమ్మేసే పఠాన్‌.. మళ్లీ కుమ్మేసిన దీపికా

Update: 2022-12-22 10:44 GMT
బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ హీరోగా రూపొందిన పఠాన్ సినిమా వచ్చే నెల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన పఠాన్‌ నుండి ఒకొక్క పాట చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తెలుగు లో కూడా పఠాన్‌ ను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పఠాన్ నుండి వచ్చిన పాటలో దీపికా పదుకునే అందాల ఆరబోత అభిమానులకు కన్నుల విందు చేస్తే.. కొందరు మాత్రం మరీ ఇంత అరాచకంగా అందాల ఆరబోత చేయడం ఏంటీ అంటూ విమర్శలు గుప్పించారు. దీపికా పుకునేను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న ఈ సమయంలో మరో పాట పఠాన్ నుండి వచ్చింది.

తాజాగా పఠాన్ నుండి వచ్చిన కుమ్మేసే పఠాన్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పాటలో కూడా దీపికా పదుకునే తన అందాల ఆరబోత చేస్తూ అలరించింది.

అందాల విందు చేసిన దీపికా పదుకునేతో పాటు షారుఖ్ ఖాన్ యొక్క లుక్ మరియు ఆయన యొక్క ఫిజిక్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

షారుఖ్ మరియు దీపికా పదుకునేలా యొక్క డాన్స్ తో పాట మరింతగా ఆకట్టుకుంటూ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. హిందీతో పాటు తెలుగు లో కూడా ఈ పాటకు మంచి పాపులారిటీ దక్కే అవకాశం ఉంది.

మునుపటి పాటతో పోల్చితే ఈ పాట లో దీపికా అందాల ఆరబోత తక్కువ ఉంది. కనుక వివాదం అయ్యే అవకాశాలు లేవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పఠాన్‌ కుమ్మేస్తాడు అంటూ ఈ పాటతో చెప్పకనే చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View

Tags:    

Similar News