కౌశల్.. బిగ్ బాస్ విన్నర్.. 16 మంది అరవీర భయంకర మనస్తత్వాలు గల వారిని ఎదుర్కొని వారిని ఓడించి విజేతగా నిలిచాడు. అంత మంది వ్యక్తిత్వాలను చదివి ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఇంతకీ కౌశల్ నిజంగానే గెలిచాడా.? 40 కోట్ల ఓట్లు ఎలా వచ్చాయ్..? మొత్తం తెలుగు ప్రేక్షకులు ఉన్నది ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది. అంతమంది వేసినా అన్ని ఓట్లు రావే.. అయినా కౌశల్ కోసం అందరూ పనిమానేసి ఇన్ని ఓట్లువేశారా.? మరి ఈయన ఎలా గెలిచాడంటూ అందరిలోనూ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది.
అయితే అందరినీ ప్రశ్నలతో ఇరికించే జర్నలిస్ట్ జాఫర్ కూడా బిగ్ బాస్ విన్నర్ ను షేక్ చేయలేకపోయాడు. అతడి ఫేక్ ఓట్ల గుట్టును చాలా గట్టిగానే అడిగేశాడు. కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని ..కోల్‌కాతా కేంద్రంగా ఓ ఐటీ కంపెనీ సాయంతో ఓట్లు వేయించుకొని గెలిచారని.. ఇందుకోసం లక్షలు ఖర్చు పెట్టారనే ప్రశ్నను కౌశల్ ను అడిగేశాడు ఆ జర్నలిస్టు. అంతేకాదు.. ఇదే విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో ఫోన్ కాల్ సందర్భంగా మీ భార్య మీతో అన్నది నిజం కాదా అని కౌశల్ ను ప్రశ్నించాడు.
దీనికి కౌశల్ వాయిదా వేసేలా దబాయించి తప్పించుకున్నాడు. ఇంతమందికి ఇవ్వడానికి తన దగ్గర కోట్లు లేవని.. ఈఎంఐలు - అప్పులు కడుతున్నానని తప్పించుకున్నాడు.
కానీ జర్నలిస్ట్ వదలకుండా 50 కోట్ల ఓట్లు ఎలా వస్తాయని.. అంత మంది ఎలా అభిమానిస్తారో చెప్పాలని అడిగేశాడు. కానీ అది ప్రజాబలమే అని.. జాఫర్ లాంటి కత్తిలాంటి జర్నలిస్ట్ ను అందరూ అభిమానించినప్పుడు.. కౌశల్ ను కూడా అందరిలోకి బెస్ట్ కాబట్టే తనను అభిమానించారని సమాధానమిచ్చాడు. ఇలా అందరినీ ఇరుకునపెట్టే ఆ సదురు జర్నలిస్ట్ నే కౌశల్ తన మాటలతో మిన్నకుండి పోయేలా చేశాడు. ఇంటర్వ్యూ మొత్తం పూర్తయ్యాక సదురు జర్నలిస్ట్ కూడా కౌశల్ ను ప్రాధేయపడ్డాడు. మిమ్మల్ని ప్రశ్నించినందుకు నన్ను ట్రోల్ చేయకండని మీ కౌశల్ ఆర్మీకి చెప్పండని విన్నవించాడు. ఈ మొత్తం ఇంటర్వ్యూ చూశాకే అర్థమైంది. నిజంగానే కౌశల్ మామూలోడు కాదని.. అందుకే అంతమందిని ఓడించి గెలిచాడని..
వీడియో కోసం క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=0VFXRJ4igu8