తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బీస్ట్'. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బీస్ట్ సినిమాను ఇప్పటికే విదేశాల్లో భారీగా స్క్రీనింగ్ కు ప్లాన్ చేశారు. యూఎస్ తో పాటు పలు దేశాల్లో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. అయితే ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలను అరబిక్ దేశాల్లో ప్రదర్శించాలంటే అక్కడి సెన్సార్ ను దాటాల్సి ఉంటుంది.
బీస్ట్ సినిమా ను అరబిక్ దేశాలు బ్యాన్ చేస్తున్నారు. టెర్రరిజం నేపథ్యంలో రూపొందిన సినిమా అవ్వడం వల్ల బీస్ట్ ను అక్కడ విడుదల కానిచ్చేది లేదు అంటూ అక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి. మొదటగా బీస్ట్ సినిమాను కువైట్ దేశం బ్యాన్ చేసింది. అక్కడ సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లిన బీస్ట్ సినిమాలో టెర్రరిజం అనే అంశం ఉన్న కారణంగా తమ దేశంలో ప్రదర్శణకు అనుమతులు ఇవ్వబోం అంటూ ప్రకటించారు.
కువైట్ దారిలోనే ఇతర అరబిక్ దేశాలు కూడా బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మరో అరబిక్ దేశం అయిన ఖతార్ దేశం కూడా ఈ సినిమా ను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ సినిమాలో కంటెంట్ ఉందంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేసి సినిమా సెన్సార్ కు నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీగా విడుదల చేసి రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకోవాలనుకున్న మేకర్స్ కు నిరాశ తప్పలేదు. యూఎస్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల కాబోతుంది. మరి కాసేపట్లో అక్కడ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించగడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
నెల్సన్ దిలీప్ గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కాన్సెప్ట్ పరంగా చాలా విభిన్నంగా ఉంటాయని టాక్ దక్కించుకుంది. అందుకే ఈ సినిమా ను భారీ ఎత్తున తమిళ ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెల్సన్ దిలీప్ గత చిత్రం డాక్టర్ వరుణ్ కు తెలుగు లో మంచి వసూళ్లు దక్కాయి. కనుక విజయ్ స్టార్ డమ్ తో ఈ సినిమా తో సక్సెస్ ను దక్కించుకుని నెల్సన్ దిలీప్ గతంను మించిన వసూళ్లను దక్కించుకునేనా అనేది చూడాలి.