ఈ ఛాలెంజ్ ఏదో బాగుంది సూర్యా

Update: 2018-05-06 17:30 GMT
మొన్న విడుదలైన నా పేరు సూర్య టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ భారీగా తెచ్చేసుకుంది. ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నిర్మాతలలో ఒకరైన లగడపాటి శ్రీధర్ నిన్న చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. నా పేరు సూర్య ఎవరికైనా నచ్చకపోతే టికెట్ డబ్బులో సగం వెనక్కు ఇచ్చేస్తానని ప్రకటించడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. కాని ఆ సౌకర్యం ఇక్కడివారికి కాదు. ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే. దేశభక్తి ఆణువణువూ నిండిన ఈ కథ ఎవరికి నచ్చకపోయే ఛాన్స్ లేదు కాబట్టే ఇలా చెబుతున్నాను అంటున్న శ్రీధర్ నచ్చని వాళ్ళు తనకు టికెట్ తో పాటు తగిన కారణాలు జత పరిస్తే రీ ఫండ్ ఇచ్చేస్తా అంటున్నాడు. ఆయన నమ్మకం మాట సరే కాని ఈ ఆఫర్ మాత్రం అక్కడి ప్రేక్షకులకు మంచి అవకాశమే. కాని నిజంగా టికెట్ డబ్బులు వెనక్కు ఇమ్మనే ప్రేక్షకులు ఉంటారా అంటే ఈ ప్రతిపాదన గతంలో ఎవరు చేయలేదు కాబట్టి రెస్పాన్స్ వచ్చాకే చెప్పగలం.

నా పేరు సూర్య మూడు రోజుల వీక్ ఎండ్ ని పూర్తిగా వాడేసుకున్నాడు.రేపు ఉదయానికి 60 కోట్లకు దగ్గరలో గ్రాస్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించుకుంటున్న నా పేరు సూర్య బన్నీ గత సినిమాల్లాగే డివైడ్ టాక్ నుంచి సూపర్ హిట్ వైపు వెళ్తుంది అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అల్లు అర్జున్ నటనకు అన్ని చోట్లా యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా వక్కంతం వంశీ మొదటి సినిమానే అయినప్పటికీ టేకింగ్ పరంగా మంచి మార్కులే వేయించుకుంటున్నాడు. ఏ రేంజ్ కు వెళ్తుంది అనే దాని మీద అల్లు అర్జున్ ఫాన్స్ దృష్టి పెట్టారు. ఇప్పుడు లగడపాటి శ్రీధర్ ఛాలెంజ్ కు రెస్పాన్స్ రాకపోతే సినిమా గురించి ఎవరు నెగటివ్ గా తీసుకోలేదు అనుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ తెలుగు స్టేట్స్ లో కూడా ఇస్తే బాగుంటుంది కాని అపరిమితంగా ఉండే తెలుగు రాష్ట్రాల మార్కెట్ లో ఎవరు నిజం చెబుతున్నారో లేదో కనుక్కోవడం కష్టం కాబట్టి ఎన్ఆర్ఐలకు ఇవ్వటమే మంచి నిర్ణయం.
Tags:    

Similar News