స్విమ్‌ సూట్ కి రెడీ.. మీరు సిద్ధ‌మా?

Update: 2015-11-03 17:30 GMT
పట్టుమని పది సినిమాలైనా చేయ‌లేదు. నా త‌ఢాఖా ఏంటో చూపిస్తా అని అంటోంది ల‌క్ష్మి మీన‌న్‌. గ‌జ‌రాజు సినిమాతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు బిజిలీలా ఆక‌ట్టుకుంది. కానీ ఇంత‌లోనే ఈ అమ్మ‌డు స్విమ్ సూట్ వేసి వేడెక్కించేందుకు రెడీ అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. న‌ల్ల‌న‌య్య విశాల్ స‌ర‌స‌న హ్యాట్రిక్ సినిమాలు చేసి ఆక‌ట్టుకున్నీ అమ్మ‌డు ప్ర‌స్తుతం చ‌దువు కొన‌సాగిస్తూనే సినిమాల‌తో బాగానే ఆర్జిస్తోంది. ఈ అమ్మడు అజిత్‌కు చెల్లెలిగా నటించిన వేదాళం చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా లక్ష్మీమీనన్‌ తో చిట్ చాట్ ...
 
* వేదాళం కథ నచ్చింది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. అందుకే చెల్లెలి పాత్రకు అంగీకరించాను. వేదాళం చిత్రం చూసిన వారికి అందులో తమిళ్ అనే నా పాత్ర బాగా నచ్చుతుంది.
 
* అజిత్ నుంచి ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నా. సెట్‌ లో ఒక హలో ఒక హాయ్ అంతే. నా పని ముగియగానే ఒక పక్కన కూర్చుంటాను. అజిత్ అంతే అవసరం ఉంటేనే మాట్లాడతారు. లేకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు.
 
* గ్రామం నేప‌థ్యంలో క‌థ‌లు అంటే నాకు అంత‌గా సూట‌వ్వ‌డం లేదు.  కానీ  అలాంటి అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయి. నాకు మాత్రం మోడ్రన్ పాత్రలు ధరించడం అంటేనే ఇష్టం. కొంబ‌న్ లో కంటే డిఫ‌రెంటుగా క‌న‌బ‌డాల‌ని ఉంది.
 
* ప్ర‌స్తుతం హార‌ర్ ట్రెండ్ న‌డుస్తున్నా..  ఇప్పటి వరకూ అలాంటి అవకాశం రాలేదు. ఇకపై వస్తే తప్పకుండా నటిస్తాను. ఎలాంటి చిత్రం అయినా అందులో నా పాత్ర నచ్చాలి. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను న‌టించిన‌వాటిలో  నాన్ శివప్పుమణిదన్ చిత్రంలో నాకు న‌చ్చిన పాత్ర‌లో చేశాను.
 
* వ్య‌క్తిగ‌తంగా డ్యాన్స్‌ లో ప్రావీణ్యం ఉంది. నటనకంటే పాడటమంటేనే నాకు చాలా ఇష్టం. సంగీత దర్శకులు డీ.ఇమాన్. తమన్ చిత్రాల్లో పాడాను. ఇతర సంగీత దర్శకులు అవకాశం ఇచ్చినా పాడటానికి సిద్ధమే. పాడిన తర్వాత ఆ పాటను పూర్తిగా విన్నప్పుడు కలిగే ఆనందమే వేరు.
 
* నేను లంగా ఓణీల్లో క‌నిపిస్తేనే అభిమానుల‌కు ఇష్టం. అయినా గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తాను. అందులోనూ రాణిస్తాను. చిత్ర కథకు స్విమ్‌ సూట్‌ లు అవ‌స‌రం అనుకుంటే  తప్పకుండా వాటిలో క‌నిపిస్తాను. సన్నివేశం ప్రాముఖ్యత తెలిసిన తరువాత నటించనని చెప్పను.

* వేదాళం ఈ దీపావ‌ళి కి రిలీజ‌వుతోంది. అయినా ఎలాంటి టెన్షన్ లేదు. టెన్షన్ అన్నది ఎరుగని క్యారెక్టర్ నాది. ఒక చిత్రం పూర్తి చేశానంటే తదుపరి చిత్రానికి రె డీ అయిపోతాను. దీపావళికి వేదాళం చిత్రం విడుదలవడం సంతోషమే.
 
*నేను ప్ర‌స్తుతం కేర‌ళ‌లోనే ఉంటున్నా. చెన్నైకి మకాం మార్చే ఆలోచన నాకు లేదు. ఇంతకు ముందు నాతో అమ్మ కూడా వచ్చేది. ఇప్పుడు నేను ఒంటరిగానే వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మమ్మ కూడా వస్తుంటుంది. అలా షూటింగ్‌ లకు వచ్చి వెళ్లడం నాకు శ్రమ అనిపించడం లేదు.
 
* జీవితంలో ప్రేమ‌ - పెళ్లి అనే ఆలోచ‌నే లేదు. ఒక వేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అది పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతుంది.
 
* ఇటీవ‌లి కాలంలో చాలా అవకాశాలు వస్తున్నా అన్నీ అంగీకరించడం లేదు. నచ్చిన కథా చిత్రాలే చేస్తున్నాను. వేదాళం తర్వాత జయం రవి సరసన ఒక చిత్రం చేస్తున్నా. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు చెబుతాను.
Tags:    

Similar News