బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న తన తండ్రి ‘ఎన్టీఆర్’ బయోపిక్ విడుదలకు సిద్దం అవుతుంది. రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. మొదటి పార్ట్ మొత్తం ఎన్టీఆర్ సినీ కెరీర్ ను చూపించబోతున్నారు. ఇక రెండవ పార్ట్ లో పూర్తిగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంను చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం చూపించే క్రమంలో ఖచ్చితంగా ఎన్టీఆర్ రెండవ భార్య అయిన లక్ష్మీ పార్వతిని చూపించాల్సి ఉంటుందని, ఈ చిత్రంలో ఆమె పాత్ర ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు లక్ష్మీ పార్వతి పాత్ర గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. తాజాగా లక్ష్మీ పార్వతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ఎన్టీఆర్’ మూవీలో తన పాత్ర ఉంటుందని తాను భావించడం లేదు అంది. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నేను ఎంటర్ కాకముందు ఎక్కడి వరకు అయితే నడిచిందో అక్కడి వరకే చూపిస్తారని, నన్ను చూపించే సాహసం చేస్తారని తాను భావించడం లేదు అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. ఆ సినిమా గురించి ఎక్కువగా నటించేందుకు ఆసక్తి లేదు అంది.
ఇక వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై మాత్రం స్పందిస్తాను అంది. వర్మ తన అనుమతి తీసుకుని, కథ నాకు చెప్పిన తర్వాత సినిమాను మొదలు పెట్టాడని, సెన్సార్ బోర్డు కూడా నా బయోపిక్ కనుక నా సంతకం ఉంటేనే సినిమా విడుదలకు అనుమతిస్తుందని లక్ష్మీ పార్వతి పేర్కొంది. ఈతరం హీరోయిన్స్ లో మీ పాత్రకు ఎవరైతే బాగుంటారని మీరు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు నేను పెద్దగా సినిమాలను ఫాలో అవ్వను. కనుక ఆ విషయాన్ని నేను చెప్పలేనంది.