తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై లక్ష్మీ పార్వతి స్పందన ఏంటా అంటూ మీడియాలో జనాలు తెగ వెదికారు. ఎన్టీఆర్ మూవీపై లక్ష్మీ పార్వతి స్పందించింది. తిరుపతిలో దైవ దర్శణంకు వెళ్లిన లక్ష్మీ పార్వతి అక్కడే మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పై తనదైన శైలిలో స్పందించింది. ఎన్టీఆర్ చిత్రంను మొదటి నుండి విమర్శిస్తూ వస్తున్న లక్ష్మీ పార్వతి విడుదల తర్వాత కూడా అదే తరహాలో సినిమాపై విరుచుకు పడినది.
లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ... దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడనగానే నాకు నమ్మకం లేదు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఇంకా బాగా తీయవచ్చు. కాని ఆ సినిమానే ఆయన చెడగొట్టాడు. ఎన్టీఆర్ చిత్రాన్ని క్రిష్ గొప్పగా - నిజాలు చూపించి తీస్తాడని నేనేం నమ్మకం పెట్టుకోలేదు. ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ అస్సలు సూట్ అవ్వడు. ఎందుకంటే ఎన్టీఆర్ గొప్ప హైట్ ఉన్న వ్యక్తి అలాగే ఆయన పర్సనాలిటీ కి కూడా బాలకృష్ణ సూట్ అవ్వడు. ఎన్టీఆర్ అంటేనే చాలా డిఫరెంట్, ఆయన పాత్రలో ఎవరు కూడా చేయలేరు. కాస్త కుడి ఎడమగానైనా ఎన్టీఆర్ ను పోలి ఉంటే బయోపిక్ కు కాస్త వెయిట్ దక్కేది. కాని బాలకృష్ణ ఏ విధంగా కూడా ఎన్టీఆర్ ను సరిపోలి ఉండడు.
మహానుభావుడు ఎన్టీఆర్ సినిమాను తీయాలనుకోవడమే గొప్ప విషయం. అయితే రాజకీయాల కోసం, నందమూరి అభిమానులను ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి ఓట్లు వేయించుకునేలా చేయడం కోసం ఈ సినిమా తీశారు. చంద్రబాబు నాయుడు కను సైగల్లో ఈ సినిమా రూపొందిందంటూ లక్ష్మీ పార్వతి కామెంట్ చేసింది.
నాకు సహజంగా సినిమాలు చూసే అవాటు లేదు. కాని ఎన్టీఆర్ సినిమా కనుక తప్పకుండా చూస్తాను. తన అభిప్రాయం చెప్పేందుకైనా చూస్తాను. ఇప్పటికే చూసిన కొందరు నాకు ఫోన్ చేసి డాన్స్ లు ఎక్కువ ఉన్నాయన్నారు, కొంత సాగతీసినట్లుగా అనిపించిందన్నారు. కథ పెద్దగా ఉన్నట్లుగా అనిపించలేదన్నారు. పూర్తి కథ మాత్రం నాకు ఎవరు చెప్పలేదు. నేను సినిమా చూసిన తర్వాత ఇంకాస్త డీటైల్డ్ గా స్పందిస్తానంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.
Full View