స్టైల్ లో తారక్ కి తగినట్టుగా లక్ష్మి ప్రణతి..!

Update: 2022-10-24 08:18 GMT
RRR సినిమా కోసం జపాన్ వెళ్లిన స్టార్ జోడీలు అక్కడ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ లక్ష్మి ప్రణతి.. రాం చరణ్, ఉపాసన.. స్టార్ జోడీలు అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్ని చుట్టేస్తున్నారు. అంతేకాదు అక్కడ భారీగా షాపింగ్ కూడా చేస్తున్నట్టు ఉన్నారు.

సినిమా వెంట సినిమాతో చాలా బిజీగా ఉండే స్టార్స్.. ఫ్యామిలీతో గడిపే టైం చాలా తక్కువగా ఉంటుంది. దొరికినప్పుడే వారితో కలిసి ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. జపాన్ వెళ్లిన చరణ్, ఉపాసన.. ఎన్.టి.ఆర్, లక్ష్మి ప్రణతిలు ఈ వెకెషన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. స్టార్ వైఫ్స్ కూడా వారికి తగినట్టుగానే స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నారు.

మోడ్రెన్ డ్రెస్ లతో వారు కూడా హీరోలకు తగినట్టుగానే క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఉపాసన ఓ బిజినెస్ ఉమెన్ కాబట్టి ఆమెకు  స్టైలిష్ కాన్సెప్ట్ మీద ఒక అవగాహన ఉంది. అందుకే తన టేస్ట్ కి తగినట్టుగా ఆమె ఖరీదైన కాస్టూమ్స్ ని ధరిస్తుంది. జపాన్ లో ఎన్.టి.ఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి కూడా తన లుక్స్ తో ఆకట్టుకుంది.

లక్ష్మి ప్రణతి కాస్టూమ్ కూడా ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ప్రింటెడ్ స్టైలిష్ టాప్ తో దానికి తగినట్టుగా మ్యాచింగ్ ప్యాంట్ తో లక్ష్మి ప్రణతి కూడా మోడ్రెన్ లుక్ తో మెప్పించింది. అంతేకాదు లక్ష్మి ప్రణతి బ్యాగ్ కూడా కళ్లలో పడ్డది.. సింపుల్ గా కనిపించినా సరే ఆ బ్యాగ్ చాలా కాస్ట్ లీ అని తెలుస్తుంది. దీని ధర 3.57.268  రూపాయలు. లక్ష్మి ప్రణతితో ఎన్.టి.ఆర్ కూడా సింపుల్ లుక్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు.

మరోపక్క ఉపాసన కూడా మోడ్రెన్ కాస్టూమ్ తో కనిపించింది. బ్లాక్ టీ షర్ట్.. లైట్ కలర్ బాటం తో స్టైలిష్ లుక్ తో తన మార్క్ కనిపించింది. RRR ప్రమోషన్స్ కోసమని వెళ్లిన వీరు అక్కడ తమ స్టార్ హస్బండ్ లజేబులు ఖాళీ చేసే పనిలో ఉన్నారని అర్ధమవుతుంది. సినిమా ప్రమోషన్స్ కోసమే వెళ్లినా ఈ స్టార్ జోడీలు జపాన్ లో బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు RRR సినిమా వల్ల జపాన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అక్టోబర్ 21న జపాన్ లో RRR రిలీజ్ కాగా అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News