కరోనా కారణంగా వచ్చిన పెద్ద మార్పు ఏదైనా ఉందంటే .. అది డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ బలపడటమే. అంతకుముందు ఓటీటీలు ఉన్నప్పటికీ, వాటి గురించిన అవగాహన పట్టణాల్లో .. టౌన్లలో ఎక్కువగా ఉండేది. ఓటీటీలో సినిమాలు గట్రా చూసేవారి సంఖ్య తక్కువగానే ఉండేది. కానీ కరోనా తొలి విడత బ్యాటింగ్ చేసిన తరువాత అందరికీ ఓటీటీలపై ఒక అవగాహన వచ్చేసింది. టీవీ ఛానల్స్ మాదిరి ఓటీటీ ఛానల్స్ చాలానే ఉన్నాయనే విషయం అర్థమైంది. ఏ భాషకి చెందిన సినిమాలైనా స్మార్ట్ ఫోన్లో చూసేయవచ్చనే విషయం స్పష్టమైంది.
కరోనా కారణంగా ఇంటి దగ్గరే ఉండిపోవలసి రావడంతో ఓటీటీ అనేది అందరి పాలిట ప్రధాన వినోద సాధనమై కూర్చుంది. ఇక అప్పటి నుంచి అంతా కూడా ఓటీటీకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' ను మరింత బలంగా తీర్చిదిద్దడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. నిర్మాతగా ఆయనకి ఉన్న ముందుచూపు గురించిన ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ రోజున ఆయన ఈ స్థాయిలో .. ఈ రేంజ్ లో చక్రం తిప్పడానికి కారణం ఆ ముందు చూపే. భవిష్యత్తు ఓటీటీలదే అని గ్రహించిన ఆయన 'ఆహా'పై పూర్తి దృష్టి పెట్టారు.
ఒక వైపున గీతా ఆర్ట్స్ పై పెద్ద సినిమాలను .. మరో వైపున గీతా ఆర్ట్స్ 2 పై చిన్న సినిమాలను చేస్తూ వస్తున్న ఆయన, ఇటీవల అల్లు ఎంటర్టైన్ మెంట్స్ ను కూడా సిద్ధం చేశారు. ఈ బ్యానర్లోనే హిందీ 'జెర్సీ' సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఆ పనులన్నీ చక్కబెడుతూనే ఆయన 'ఆహా' కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. 'ఆహా' కోసం ఆయన పెద్ద మొత్తంలోనే సిబ్బందిని తీసుకున్నారు. స్టార్ డైరెక్టర్స్ తోనే కొత్త కాన్సెప్ట్ లు డిజైన్ చేయించి వారితోనే ఆ కార్యక్రమాలను చేయిస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.
ఇక బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోను 'అన్ స్టాపబుల్' కోసం వ్యాఖ్యాతగా ఒప్పించడం ఆయనకే చెల్లింది. ఆయన ఆశించినట్టుగానే ఈ టాక్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక తెలుగులో రీమేక్ చేస్తే వర్కౌట్ కాని ఇతర భాషా చిత్రాలను డబ్ చేసి 'ఆహా' ద్వారా రిలీజ్ చేయాలనే ఆలోచనను కూడా ఆయన ముందుకు తీసుకుని వెళుతున్నారు. అలాగే ఇకపై ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమాను నెటిజన్ల ముందుకు తీసుకురానున్నారు. ఈ శుక్రవారం నుంచి నాగశౌర్య 'లక్ష్య' స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి నెంబర్ వన్ తెలుగు ఓటీటీగా 'ఆహా'ను నిలబెట్టే విషయంలో అల్లు అరవింద్ ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదనే విషయం అర్థమవుతూనే ఉంది.