ఓటీటీల ప్రభావం పెరిగిపోవడం.. బాలీవుడ్ ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోవడంతో బాలీవుడ్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. బిగ్ స్టార్స్ నటించిన భారీ సినిమాలు కూడా ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. కంటెంట్ ఓ కారణం కాగా మారిన ఆడియన్స్ పల్స్ పట్టడంతో దర్శకులు, నిర్మాతలు విఫలం కావడం మరో కారణంగా మారింది. దీంతో ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాల్ని అందిస్తోంది.
దీనికి ఓటీటీలు కూడా ప్రధాన కారణంగా నిలిచాయి. కరోనా కారణంగా ఓటీటీల ప్రభావం పెరగడంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడానికి ఆసక్తిని చూపించడం లేదు. రెండు మూడు వారాల తరువాత ఓటీటీల్లో చూడొచ్చులే అని ఫిక్సయిపోతున్నారు. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ అదే తరహాలో ఓటీటీలోకి వచ్చేయడంతో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. ఈ పరిస్థిలని మార్చడానికి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నడుం బిగించినట్టుగా తెలుస్తోంది.
అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చద్దా`. హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్య ఈ మూవీతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ ని మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో గీతా ఆర్ట్స్ విడుదల చేయబోతోంది.
అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన ఓ వార్త ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా వరకు రెండు మూడు వారాల తరువాత ఓటీటీలో విడుదలవుతూ వస్తున్నాయి. అయితే అమీర్ ఖాన్ మాత్రం తను నటించిన `లాల్ సింగ్ చద్దా` మూవీని అలా ఓటీటీలకు మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కు ఇచ్చేయడం లేదట. సినిమా రిలీజ్ అయిన ఆరు నెలల తరువాతే ఓటీటీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ లోపు ఇండియా, జపాన్, చైనా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తాడన్నమాట. దీంతో 6 నెలల వరకు ఈ మూవీని చూసే ఛాన్స్ ఓటీటీ ఆడియన్స్ కి వుండదు.
ఈ వార్త విన్న వారంతా అది సూపర్ స్టార్ దమ్ము అంటె!..సూపర్ స్టార్ ఓటీటీలకే బొమ్మ చూపించేస్తున్నాడే! అంటూ పలువురు ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ లు చేస్తున్నాయట. ఈ వార్త గనక నిజమైతే నిజంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు సూపర్ స్టార్ అమీర్ ఖాన్ బొమ్మ చూపించినట్టే.
అమీర్ ఖాన్ తన సినిమాని ఆరు నెలల తరువాతే ఓటీటీలకు ఇవ్వబోతుండటం నిజమే అయినా ఈ మూవీ వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరిలో ఓటీటీల్లోకి వచ్చే అవకాశం వుందని, అంత వరకు ఈ సినిమాని చూడాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లలకు రావాల్సిందే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వయాకమ్ 18 స్టూడియోస్ తో కలిసి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై ఈ మూవీని అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే, అజిత్ అంధారే, రాధికా చౌదరి నిర్మించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది.