ఇటీవలే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో తెలిసిందే. 'పీకే'..'దంగల్' లాంటి చిత్రాల రికార్డుల్ని సైతం కొట్టేస్తుందని ఒకానొక దశలో అమీర్ అభిమానులు భావించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పించడం బాలరాజు పాత్రలో నాగచైతన్య నటించడం వంటి కారణాలు సినిమాపై అంచనాలు అంతకంతకు పెంచేసాయి.
స్పెషల్ ప్రీమియర్ల పేరుతో హైదరాబాద్ లో రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ సెలబ్రిటీలకు స్పెషల్ షోలు వేయడం..అనంతరం పీడ్ బ్యాక్ తీసుకోవడం...అంతా సూపర్ అని పొగిడేయడం అమీర్ జీవితంలో ఇంత అతి ఇంతవరకూ జరిగి ఉండదు. ఒక్క లాల్ సింగ్ మాత్రమే తెచ్చిన ఖ్యాతి అది. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రని లిఖిస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
కానీ అన్నీ తొలి షోతో నే ఆవిరైపోయాయి. హాట్ కేకుల్లా అమ్మడు పోవాల్సిన టిక్కెట్లు కనీసం కూడా తెగడం కష్టంగా మారింది. అంత దారుణమైన ఫలితాన్ని లాల్ సింగ్ చవి చూసాడు. ఇక ఈ సినిమాతో నాగచైతన్య బాలరాజు పాత్రతో కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతాడని చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఫలితం అన్నింటిని తారు మారు చేసింది. 30 నిమిషాల పాత్ర అయినా ఫెయిల్యూర్ లో అతను భాగమే. కాబట్టి విమర్శలు చై సైతం మోస్తున్నాడు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సింది చైతన్య కాదు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ముందుగా బాలరాజు పాత్రకు అమీర్ సేతుపతినే సంప్రదించారు. బాలీవుడ్ ఆఫర్...సహా అమీర్ తో తెరను పంచుకునే అవకాశం రావడంతో విజయ్ సేతుపతి కూడా పాజిటివ్ గానే ఉన్నాడు. అప్పటికే చిరంజీవి..రజనీకాంత్.. కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకమైను గుర్తింపును దక్కించకున్నాడు.
సీనియర్ హీరోల చిత్రాల్లో సేతుపతి నటిస్తే సినిమాకి అదో అందంలా భావిస్తారు అభిమానులు. ఈ నేపథ్యంలో బాలరాజు పాత్రలోనూ నటించాలని ఆశపడ్డారు. కానీ సేతుపతి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే 'ఉప్పెన' .'.సైరా నరసింహారెడ్డి' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పైగా అమీర్ తో సినిమా అంటే ముందుగా వర్క్ షాప్స్ లో పాల్గొనాలి.
అందుకు అదనంగా డేట్లు కేటాయించాలి. విజయ్ సేతుపతి బిజీ షెడ్యూల్ కారణంగా అవన్నీ చేయలేక లాల్ సింగ్ ఆఫర్ ని వదులుకోవాల్సి వచ్చింది. అలా వదులుకోవమే ఇప్పుడు మంచిదైంది. లేదంటే సినిమా ఫెయిల్యూర్ లో సేతుపతి భాగం అయ్యేవాడు. ఈ విషయంలో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ నటించకుండా మంచి పని చేసాడని.. లేదంటే ఈ సినిమా ఫలితం బాలీవుడ్ లో అతనికి ఓ చేదు అనుభవంలా మిగిలిపోయేదని అభిప్రాయ పడుతున్నారు.