ఎవరికైనా.. ఎప్పుడైనా విన్ అయితే వచ్చే కిక్కే వేరు. జీవితంలో కోరుకున్నది దక్కించుకున్నప్పటి సందర్భాన్ని మరిచిపోరు. వాటికి సంబంధించిన వస్తువులను ఇష్టంగా.. భద్రంగా చూసుకుంటారు. వాటిని ఎవరైనా తక్కువ చేసి చూస్తే ఠక్కున కోపమొస్తుంది. అందుకు కారణమైన వాళ్లపై చిర్రెత్తుకు వస్తుంది కూడా. ఒకప్పటి టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతికి రీసెంట్ గా ఇలాంటి అనుభవం ఎదురైంది. అదెవరి నుంచో కాదు.. మాజీ విశ్వసుందరి - బాలీవుడ్ హీరోయిన్ అండ్ అతడి భార్య అయిన లారా దత్తా నుంచి..
నాలుగు రోజులుగా ముంబయిలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ముంబయి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వర్షపు నీరు రోడ్లనే కాదు ఇళ్లనూ ముంచెత్తుతోంది. దానితో మిస్సిండియా లారాదత్తా ఉండే ఇంటి ఆవరణలో కూడా నీరు నిలిచిపోయి గ్లాస్ డోర్ ల నుంచి లోపలకు వచ్చేయడం మొదలెట్టింది. దీంతో నీరు లోపలకు రాకుండా మహేష్ భూపతికి టెన్నిస్ అంతర్జాతీయ మ్యాచ్ లలో గెలుపొందిన సందర్భాల్లో దాచుకున్న టవల్స్ అన్నింటిని ఆ గ్లాస్ డోర్ల కింద అడ్డుగా పెట్టింది. అంతటితో ఊరుకోకుండా ఈ విషయం సోషల్ మీడియాలో కూడా పెట్టింది. ‘‘వింబుల్డన్ - యూఎస్ ఓపెన్ - ఆస్ట్రేలియా ఓపెన్ - ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ టవల్స్ అన్నింటిని ఓ మంచి పని కోసం వాడాను’’ అంటూ మహేష్ భూపతి పేరు పెట్టి మరీ ఫొటో షేర్ చేసింది. దీంతో మహేష్ భూపతికి ఒళ్లు మండిపోయింది. దీంతో వెంటనే అతడు ‘నాతో తమాషాలు చేస్తున్నావా... అవి ఏళ్ల తరబడి పడిన కష్టానికి గురుతులు’ అంటూ రిప్లయ్ కామెంట్ పెట్టాడు.
అయినా లారా దత్తా తలచుకుంటే ఇంటిలో టవల్స్ కే కరువా... అన్నీ వదిలేసి గ్రాండ్ స్లామ్ లో గెలిచిన టవల్స్ అన్నింటినీ ఇలా అడ్డదిడ్డంగా వాడటమే కాకుండా ఆ విషయం గొప్పగా చెప్పుకుంటే మహేష్ భూపతికి మండకుండా ఉంటుందా... సాధారణంగా భార్యలంతా తమ భర్త గొప్పతనాన్ని కాస్త ఎక్కువ చేసి చెబుతారు. లారా దత్తా ఇందుకు రివర్స్ లో వెళ్తోందేంటో?