ఇండియన్ సినిమా ఖ్యాతి గత కొన్నేళ్ళుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ప్రపంచంలో హాలీవుడ్ సినిమాల స్థాయిలో కాకపోయినా ఇది ఇండియన్ సినిమా అనేలా గుర్తింపు దక్కుతోంది. అందుకు కారణం మన కళాకారులే అని చెప్పాలి. చాలా మంది హాలీవుడ్ దర్శకులు ఇండియన్ యాక్టర్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అవసరం వచ్చినప్పుడు అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇక ఆస్కార్ రేంజ్ కి కూడా ఇండియన్ నటీనటులు గుర్తింపు అందుకున్నారు. అయితే కొన్ని నిమిషాలు ముందు ముగిసిన తాజా.. 90వ ఆస్కార్ సంబరాల్లో దిగ్గజ నటీనటులు శ్రీదేవికి సంతాపాన్ని తెలియజేశారు. అందాల తారగా శ్రీదేవి పేరు తెచ్చుకుంది అనడానికి ఆస్కార్ లో గుర్తుచేసుకోవడం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అప్పట్లో స్టీవెన్ స్పీల్బర్గ్ - జురాసిక్ పార్క్ సినిమాలో శ్రీదేవిని కీలక పాత్ర కోసం ఎంచుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే శ్రీదేవి చాలా బిజీ. రెండు మూడేళ్ళ వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నెలల తరబడి నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో ఆమె హాలీవుడ్ సినిమాలో అనుకొని విధంగా అవకాశాన్ని మిస్ చేసుకుందట.
ఇక దిగ్గజ నటుడు శశి కపూర్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా హాలీవుడ్ కి కొంచెం దగ్గరగా ఉండేవారు. శశి కపూర్ కి కూడా ఆస్కార్ లో సంతాపాన్ని తెలియజేశారు.