బాలీవుడ్ లో ఈమద్య వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరేందుకు సిద్దంగా ఉన్న ముద్దుగుమ్మ అనన్య పాండే అనూహ్యంగా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటుంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమెను ఈ కేసులో అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే తాను ఎప్పుడు ఆర్యన్ కు డ్రగ్స్ ఇవ్వలేదు.. తాను కూడా డ్రగ్స్ ఎప్పుడు తీసుకోలేదు అంటూ తేల్చి చెప్పింది. ఈమె ఇచ్చిన సమాధానంపై విచారణ అధికారులు సంతృప్తిగా లేరని.. మళ్లీ మళ్లీ కూడా ఈమెను విచారించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఈమెకు వచ్చిన సినిమా ఆఫర్లు చేజారుగుతున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోతున్న తెలుగు తమిళ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండేను ఎంపిక చేయడం జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆమద్య స్వయంగా దర్శకుడు ముంబయి వెళ్లి అనన్యకు కథ వినిపించాడని కూడా కొందరు అంటున్నారు. ఆ విషయంలో క్లారిటీ లేదు కాని వీరి కాంబో సినిమా కోసం అనన్య ను సంప్రదించారని మాత్రం కథనాలు జోరుగా వచ్చాయి. ఇప్పుడు ఆమె డ్రగ్స్ కేసులో ఉన్న కారణంగా ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే ఉద్దేశ్యంతో ఆమెను ఈ సినిమా నుండి తప్పించారనే కథనాలు మొదలు అయ్యాయి. అధికారికంగా ప్రకటించకుండానే ఆమెను తప్పించారనే వార్తలు అక్కడ ఇక్కడ జోరుగా వస్తున్న నేపథ్యంలో అనన్య స్పందించింది.
డ్రగ్స్ కేసు వల్ల తనను సినిమా నుండి తప్పించారనే వార్తలు ఏమాత్రం నిజం కాదు. అసలు తాను ఇప్పటి వరకు సౌత్ లో లైగర్ మినహా ఏ ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు. విజయ్ సర్ సినిమా నుండి ఆఫర్ నాకు రాలేదు. అసలు ఆఫర్ రాకుండా నన్ను ఎలా తొలగిస్తారు చెప్పండి అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. మీడియాలో ఈ సమయంలో నా గురించి వస్తున్న వార్తలను గుడ్డిగా నమ్మవద్దు ప్లీజ్ అంటూ అనన్య విజ్ఞప్తి చేసింది. తనకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని.. విచారణ అధికారులకు అదే విషయాన్ని చెప్పాను.. ముందు ముందు కూడా నేను విచారణలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ఆమె పేర్కొంది.