తమిళ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచంద్రన్ కొలవెరిడీ తో సందడి చేసి పదేళ్లు అయ్యింది. ఇప్పటికి కూడా వై దిస్ కొలవెరి అంటూ జనాలు పాడుకుంటూనే ఉన్నారు. భాషా బేధం లేకుండా హిట్ అయిన ఆ పాట తరహాలోనే తాజాగా అరబిక్ కుత్తు తో అనిరుధ్ రవిచంద్రన్ సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ పాట సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. వ్యూస్ లైక్స్ రికార్డుల మ్రోత మోగిస్తోంది.
సూపర్ స్టార్ విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ పాటను ట్యూన్ చేసిన విషయం తెల్సిందే. ఈ పాట తో మరోసారి అనిరుధ్ దేశ వ్యాప్తంగా మళ్లీ పాపులర్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ లో ఏఆర్ రహమాన్ తర్వాత అంతటి స్థాయిని దక్కించుకున్నది ఈయనే అంటూ అభిమానులు హడావుడి చేస్తున్నారు.
ఈ సమయంలో ఎన్టీఆర్ అభిమానులు అనిరుధ్ కు ఒక ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ఎన్టీఆర్ కోసం కోసం ఒక కుత్తు ను చేయాలని వారు కోరుతున్నారు. అసలు విషయం ఏంటీ అంటే ఎన్టీఆర్ త్వరలో చేయబోతున్న కొరటాల శివ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ చేశారు. అందుకే ఎన్టీఆర్ కోసం కూడా అరబిక్ కుత్తు రేంజ్ ఒక పాట కావాలని అభిమానులు మరియు తెలుగు మ్యూజిక్ ప్రియులు కోరుకుంటున్నారు.
తమిళంలో టాప్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా పేరు దక్కించుకున్న అనిరుధ్ తెలుగు లో మాత్రం ఇప్పటి వరకు గొప్ప ఆల్బం ఇవ్వలేక పోయాడు. పవన్ సినిమాకు చేసే అవకాశం వచ్చింది. కాని ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత స్టార్ హీరోల నుండి కాల్ రాలేదు. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాకు ఈయన సంగీతాన్ని అందించే అవకాశం ను దక్కించుకున్నాడు. కనుక ఖచ్చితంగా ఓ రేంజ్ లో టాలీవుడ్ కు ఈయన రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఐటెం సాంగ్స్ అంటూ ఒక ప్రత్యేకమైన పాటలు తెలుగు లో ఎలా ఉంటాయో తమిళంలో మాస్టర్ కమింగ్.. కొలవెరిడి తాజా అరబిక్ పాటలను కుత్తు అంటారు. తమిళంలో కుత్తు అంటే విభిన్నమైన పాట అన్నట్లుగా అర్థం వస్తుంది. తన ప్రతి ఆల్బంలో కూడా ఒక కుత్తును అనిరుధ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. కనుక ఎన్టీఆర్ తో ఆయన చేయబోతున్న సినిమాలో కూడా ఒక కుత్తు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ను పూర్తి చేసి కొరటాల శివ సినిమా కోసం సన్నద్దం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సమ్మర్ లో సినిమా ను పట్టాలెక్కించి ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ 30 సినిమా కు అనిరుధ్ ఇవ్వబోతున్న సంగీతం సినిమాకు ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.