హీరోయిన్ తో ఆది పినిశెట్టి పెళ్లి ముహూర్తం?

Update: 2022-03-19 08:30 GMT
ఆది పినిశెట్టి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. గుండెల్లో గోదారి స‌హా ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన ప్ర‌తిభావంతుడు. ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి వార‌సుడు. అయితే అత‌డి పేరు ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మీడియాలో ప్ర‌ముఖంగా హైలైట్ అవుతోంది. ఓవైపు కెరీర్ పై పూర్తి దృష్టి సారించినా కానీ ఈ యువ‌హీరో ప్ర‌ముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని తొంద‌ర్లోనే పెళ్లాడేయ‌బోతున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. రెండేళ్లుగా త‌మిళ మీడియాలో ఈ క‌థనం హాట్ టాపిక్ గానే మారుతోంది.

వ‌రుస‌గా యువ‌ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు హీరో ఆది పినిశెట్టి పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. ఇంత‌కుముందు ఆది తండ్రి పుట్టినరోజు వేడుకల ఫోటోలు వైరల్ అయ్యాక‌.. హీరోయిన్ ను ఆది పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం ఆయన పెళ్లి గురించిన పుకార్లు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తమిళ హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆది డేటింగ్ చేస్తున్నాడనేది తెలిసిన‌దే అయినా పెళ్లెప్పుడో క్లారిటీ లేద‌ని గుస‌గుస వినిపించింది. గతంలో వీరిద్దరు కలిసి నటించడంతో  కోలీవుడ్ మీడియా కూడా గాసిప్ ల‌ను వైర‌ల్ చేస్తోంది. సినిమా సెట్స్ లో కలిసినప్పటి నుంచి ఒకరిపై ఒకరు మ‌న‌సుపడ్డారు. ఇప్పటికే వారు తమ ఇళ్లలో తమ బంధం గురించి తెలియజేసారు.. అంటూ గుస‌గుస వైర‌ల్ అయ్యింది. మలుపు- మరకత‌మణి చిత్రాల్లో ఈ జంట‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. త్వరలోనే ఆది తన పెళ్లిపై ప్రకటన చేసే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం హోరెత్తుతోంది. అయితే చాలా కాలంగా ఇదే త‌ర‌హా ప్ర‌చారం సాగుతుండ‌డంతో హీరోనే క‌న్ఫామ్ చేస్తే బావుంటుంద‌ని అభిమానులు కోరుతున్నారు.

ప్రేమ అలా ప‌ల్ల‌వించెను!

పాపుల‌ర్ తెలుగు త‌మిళ చిత్రాల‌ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి ప్రతిభావంతుడిగా ద్విభాష‌ల్లో రాణిస్తున్నాడు. కోలీవుడ్ లో కమర్షియల్ హీరోగా రాణిస్తూనే తెలుగులో స‌హాయ‌న‌టుడిగా సత్తా చాటుతున్నారు. విలన్ గా కూడా మెప్పిస్తున్నారు. `రంగస్థలం`లో కుమార్ బాబు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన ఆది.. అటుపై నీవెవరో -యూటర్న్ చిత్రాల్లో నటించారు. తెలుగులో నిక్కీ గల్రాని.. సునీల్ సరసన కృష్ణాష్టమిలో న‌టించింది. ఆ త‌ర్వాత‌ ఆది పినిశెట్టి సరసన మలుపు సినిమాలో నటించింది. అదే క్ర‌మంలో ప్రేమ ప‌ల్ల‌వించింద‌న్న టాక్ ఉంది.
Tags:    

Similar News