వరుణ్ తేజ్ వరుస సక్సెస్ లను ఇస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గని' రూపొందింది. కిరణ్ కొర్రపాటి - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాలో, వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగులో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి సైయీ మంజ్రేకర్ కథానాయికగా పరిచయమవుతోంది. ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "కిరణ్ కొర్రపాటి నాకు కథ చెప్పునప్పుడు .. బాక్సింగ్ ను ఎందుకు ఎత్తుకున్నారు? అనుకున్నాను. బాక్సింగ్ నేపథ్యంలో నడిచిన ఒకటి రెండు ఇంగ్లిష్ సినిమాలను చూశాను. ఆ సినిమాల్లో ఎమోషన్స్ ఎలా తీసుకుని వెళతారు? క్లైమాక్స్ లు ఎలా ఉంటాయి? అనేది చూశాను. ఆ తరువాత కిరణ్ కొర్రపాటికి నేను పెద్దగా ఏమీ చెప్పలేదు. ఈ సినిమా విషయంలో నా పాత్ర చాలా తక్కువ. ఈ సినిమాకి సంబంధించినంతవరకూ వరుణ్ తేజ్ .. డైరెక్టర్ ఎక్కువ పాత్రను తీసుకున్నారు.
అల్లు బాబీ ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమాను స్టార్ట్ చేశాడు .. కానీ కరోనా అనేది మన చేతుల్లో ఉండదు. సినిమా కష్టాలు అంటారే .. ఈ సినిమాకి ఆ కష్టాలన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి ఈ రిలీజ్ డేట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ మధ్య సినిమాకి వచ్చే అలవాటు తప్పింది. వీకెండ్ వచ్చేసరికి ఏ సినిమాకి వెళదామని అడిగే ఒక అలవాటు పోయింది. ఓటీటీలో ఈ వారం ఏయే సినిమాలు వచ్చాయి? వాటిలో ఏది బాగుందటా? అనేసి మాట్లాడుకుంటున్నారు. ఓటీటీకి నేను ఓనర్ ను అయినప్పటికీ సినిమా సినిమానే.
ఈ సినిమాలో బాక్సింగ్ ఉందికానీ .. ఇది ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామాకు ఒక బాక్సింగ్ అనే ఎమోషన్ ను కలపడం జరిగింది. ఇది ఒక తల్లీ కొడుకుల కథ .. తండ్రీ కొడుకుల కథ. అలాంటి ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాకి ఫ్యామిలీస్ రావాలి. ఈ సినిమాకి వాళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలా జనాలు అలవాటు పడిన తరువాత ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో 50 శాతం బాధ్యలతలను మోశాడు. అనుకున్నదానికంటే ఖర్చు పెరిగినా, అంతకుమించిన లాభాలు తెచ్చిపెట్టే మేటర్ ఈ సినిమాలో ఉంది .. నాకు తెలుసు" అని చెప్పుకొచ్చారు.