కోవిడ్ కారణంగా మారిన పరిస్థితుల వల్ల దక్షిణాదిలోనూ ఓటీటీ ల హవా ఊపందుకుంది. అంతకు ముందు ఓటీటీలకు దక్షిణాదిలో పెద్దగా ఆదరణ లేదు. నెట్ ఫ్లిక్స్ తప్ప మరో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూడటం సామాన్య జనందాకా వెళ్లలేదు. సినీ స్టార్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో ఫేమస్ వెబ్ సిరీస్ లని ఫాలో అయ్యేవారు. అయితే కరోనా ఓటీటీ ప్లాట్ ఫామ్ ల పరంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. థియేటర్లు మూతపడటంతో చాలా వరకు దక్షిణాది జనం కూడా ఓటీటీలకు అలవాటుపడ్డారు.
జనం తో పాటు మన స్టార్ లు కూడా ఓటీటీ బాట పట్టారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన క్రేజీ హీరోయిన్ లు చాలా వరకు డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వెబ్ సిరీస్ లు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు ఓటీటీల్లోనూ దుమ్ముదులిపేస్తున్నారు. అలా ఓటీటీలోనూ తమ సత్తా చాటుకున్న క్రేజీ హీరోయిన్ ల చాలా మందే వున్నారు. ముందుగా ఈ వరుసలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని, క్రేజ్ ని సొంతం చేసుకుంది మాత్రం సమంతనే. `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ తో సమంత ఓటీటీలో దుమ్ముతులిపేసింది.
ఈ సీరీస్ తరువాత సమంతకు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వరుస కట్టాయి. అంతగా సామ్ కి ఈ వెబ్ సిరీస్ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. సామ్ తరువాత డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తమన్నా. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన `లెవెంన్త్ అవర్` సిరీస్ లో నటించింది. మొత్తం 8 భాగాలుగా విడుదలై ఈ సీరీస్ ఆహా లో స్ట్రీమింగ్ అయి తమన్నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ తరువాత తమిళంలో `డిసెంబర్ స్టోరీ` అనే వెబ్ సిరీస్ ని చేసింది తమన్నా. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది.
తమన్నా తరువాత కాజల్ అగర్వాల్ `లైవ్ టెలీకాస్ట్` అనే థ్రిల్లర్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సారి కాజల్ ఇందులో ఘోస్ట్ గా కనిపించి షాకివ్వడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సిరీస్ ని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. కాజల్ తరహాలోనే క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ కూడా వెబ్ బాట పట్టింది. ఆమె నటించిన నెట్ ఫ్లిక్స్ థ్రిల్లర్ డ్రామా `పిట్టకథలు`. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ ఇందులో నటించిన శృతి పాత్రకు మాత్రం మంచి పేరొచ్చింది. ఆ తరువాత `బెస్ట్ సెల్లర్`లోనూ నటించింది. ఈ సీరిస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక నిత్యామీనన్ కూడా వెబ్ డ్రామాలో నటించింది. హిందీలో రూపొందించిన `బ్రీత్ ఇన్ టు ద షాడోస్` లో లెస్బియన్ గా నటించి ఆకట్టుకుంది. దీని తరువాతే నిత్యకు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం మొదలైంది. వీళ్ల తరహాలోనే ప్రియమణి, కియారా అద్వానీ, శోభితా థూళిపాల, సుస్మితాసేన్, అదితి రావు హైదరీ, హుమా ఖురేషీ, ఈషా రెబ్బా, సాయి పల్లవి, అంజలి, అమలా పాల్ వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుని వైరల్ అయ్యారు.