రాధేశ్యామ్‌ కు ఆమె వల్ల ప్రయోజనం శూన్యం

Update: 2022-03-15 08:30 GMT
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేశారు. కానీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బొక్క బోర్లా పడిందనే టాక్‌ వినిపిస్తోంది.

బాలీవుడ్ మీడియా లో ఈ సినిమా పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమయంలో సినిమాలో నటించిన భాగ్య శ్రీ గురించి చర్చ కూడా అక్కడ ఇక్కడ జరుగుతోంది. ఆమె సినిమాలో ఉండడం వల్ల కచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా పై ఆసక్తి కనబరుస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేశారు. అందుకే ఆమెను కీలక పాత్రలో నటింపజేసేందుకు గాను చాలా పారితోషికం ఇచ్చి మరీ ఒప్పించారనే వార్తలు వచ్చాయి.

భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆమె సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతూ వస్తుంది. చేసిన కొన్ని సినిమాలైనా కూడా మంచి పాత్రలను ఎంపిక చేసుకుని మరీ చేస్తూ ఉండేవారు.  దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న భాగ్యశ్రీ కి ఈ సినిమాలో దక్కిన ప్రాముఖ్యత చాలా తక్కువ అంటూ ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించిన భాగ్య శ్రీ  ఈ సినిమా చాలా నాసిరకం పాత్ర కు ఎందుకు ఒప్పుకున్నారు అంటూ కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ కి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు.. అలాగే తన నటన ప్రతిభ కనబర్చేంతగా నటించేందుకు కూడా స్కోప్ కనిపించ లేదు.

ఒక డాన్సర్ గా ఈమె సినిమా లో ప్రేక్షకులకు చూపించబడింది. కానీ ఆమె డాన్స్ ను కూడా ప్రేక్షకులు చూడలేదు. మొత్తానికి భాగ్యశ్రీ వల్ల సినిమాకి కలిగింది ఏమీ లేదు.. అలాగే సినిమా వల్ల ఆమెకు ప్రత్యేకత ఏమీ దక్కింది లేదు అంటూ సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

భాగ్యశ్రీ గత చిత్రం తలైవి కూడా ఆమెకు పెద్దగా సంతృప్తిని ఇవ్వలేదు. కంగనా కు తల్లి పాత్రలో ఆ సినిమాలో నటించారు. ఆమె అభిమానులకు కూడా ఆ సినిమా ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. కనీసం ఈ సినిమా అయినా ఆమె అభిమానులను సంతృప్తి పరుస్తుంది అని భావించారు. కానీ ఆమె పాత్ర ఆటలో అరటి పండు తరహాలోనే ఉంది అంటూ ట్రోల్స్‌ వస్తున్నాయి.
Tags:    

Similar News