`మద్రాస్ కేఫ్` అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన రాశీ ఖన్నా.. `మనం`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `ఊహలు గుసగుసలాడే`తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన టాలెంట్‌తో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం కొత్త హీరోయిన్ల రాక వల్ల తెలుగులో ఆఫర్లు తగ్గుతుండటంతో.. తమిళ, హిందీ భాషలపై రశీ ఖన్నా ఫోకస్ పెట్టి మంచి మంచి అవకాశాలను అందుకుంటోంది.
ఇప్పుడీమె తమిళంలో ఏకంగా నాలుగు ప్రాజెక్ట్‌లను టేకప్ చేసింది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో `యోధ` అనే సినిమా చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ రాజ్ అండ్ డీకే లతో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సైన్ చేసింది. ఇటు తెలుగులో ఈమె నటించిన పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అలాగే అజయ్ దేవ్‌గణ్ తో ఈమె నటించిన `రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్` ఇటీవలె రిలీజై మంచి విజయం సాధించింది.
మొత్తానికి ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ మస్తు బిజీగా గడుపుతున్న రాశీ ఖన్నా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. `రుద్ర` వెబ్ సిరీస్‌కు, అందులోని తన పాత్రకు ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదంటూ ఆనందంతో ఉప్పొంగిపోయిన రాశీ ఖన్నా.. ప్రేక్షకులు ఓటీటీలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని, తాను ఓటీటీలను ఎంచుకోవడానికి కారణం తన దగ్గరికి వచ్చిన వైవిధ్యమైన పాత్రలే అని చెప్పుకొచ్చింది.
అలాగే సినిమాల్లో మూస పద్ధతులను బ్రేక్ చేద్దామని అనుకుంటున్నట్లు తెలిపిన రాశీఖన్నా.. హీరోయిన్ అంటే డ్యూయెట్స్ కోసమో, రొమాంటిక్ సీన్స్ కోసమో సృష్టించిన గ్లామర్ బొమ్మ కాకూడదని చెప్పుకొచ్చింది.
స్క్రిప్ట్‌లో బలం ఉంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే అని.. శక్తి వంతంగా ఉంటే నిడివి పది నిమిషాలు ఉన్నా ఆ పాత్ర చేస్తానని రాశీ తెలిపింది. ఇక బాలీవుడ్‌లో తన తదుపరి సినిమా షాహిద్ కపూర్‌తో ఉంటుందని కూడా ఆమె పేర్కొంది.