టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చ పతాక స్థాయిలో జరుగుతుంది. కొన్ని వందల పుకార్లు పుట్టుకు వచ్చాయి. ఆ పుకార్లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇక పుకార్ల విషయం పక్కన పెడితే సినిమా గురించి చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి చేసిన ప్రకారం ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెంచేసింది.
సినిమా మొదటి రోజు షూటింగ్ మొదలుకుని ఈ సినిమా నభూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది అనే నమ్మకంను కల్పిస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా జక్కన్న టీమ్ చెప్పుకొచ్చారు. ఇద్దరు హీరోలు.. అదీ కాకుండా జక్కన్న బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా.. ఆయన లో అనుభవం ఇంకా పెరిగింది. కనుక బాహుబలి ని తలదన్నే సినిమా గా ఆర్ ఆర్ ఆర్ ఉంటుందని ప్రతి ఒక్క సినీ అభిమాని ఆశించారు.. ఆ సినిమాను మించి ఉండాలని ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు కోరుకున్నారు.
కాని ఎవరో అన్నట్లుగా అద్బుతాలు అస్తమానం జరుగవు.. నిజమే.. బాహుబలి అనేది ఒక అద్బుతం. ముఖ్యంగా బాహుబలి 2 అనేది చరిత్రలో నిలిచి పోయే అద్బుతం. ఆ అద్బుతాన్ని మించిన అద్బుతంను క్రియేట్ చేయడం అనేది సాధ్యం అయ్యే విషయం అయితే కాదు. అది కూడా కేవలం అయిదు సంవత్సరాల గ్యాప్ లోనే ఆ అద్బుతాన్ని తలదన్నే స్థాయిలో ఏ ఒక్కరు క్రియేట్ చేయలేరు.. అది బాహుబలి క్రియేటర్ అయినా కూడా సాధ్యం కాదు.
సాదారణంగానే ప్రతి ఒక్క సగటు సినీ అభిమాని రాజమౌళి నుండి సినిమా అన్న వెంటనే ఖచ్చితంగా బాహుబలిని మించి ఉండాలని కోరుకుంటారు. ఆ కోరిక చాలా సహజం.. సమంజసం. కాని బాహుబలి ని రీచ్ అవ్వడమే చాలా గొప్ప విషయం.. ఆ సినిమా ను బీట్ చేయడం అనేది అసాధ్యం అని ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత తేలి పోయింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాగుంది.. కాని బాహుబలి రేంజ్ లో మాత్రం లేదు అనే చెప్పాలి.
కథ.. కథనం.. విజువల్స్.. టెక్నికల్ అంశాలు.. క్లైమాక్స్.. పాత్రలు ఇలా ప్రతి ఒక్కటి కూడా బాహుబలి స్థాయిని పెంచాయి.. ఒక అద్బుతంగా నిలిపాయి. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆ స్థాయిని చేరుకోవడంలో కొంత దూరంలో ఆగి పోయింది. బాహుబలి తో పోటీ అన్నట్లుగా జక్కన్న కూడా ఈ సినిమాను తీసి ఉండడు. ఆ సినిమాను మించి ఉంటుందని ఆయన కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే బాహుబలి అనేది ఒక అద్బుతం.
ఆర్ ఆర్ ఆర్ లో ఇద్దరు హీరోలు ఉన్నారు. బాహుబలి తో ఈ సినిమా ని పోల్చిన సమయంలో సూపర్బ్ విజువల్స్.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కాని ఇది ఆర్ ఆర్ ఆర్ మాత్రమే.. బాహుబలి కాదు అని ప్రేక్షకుల్లో ఒకింత అసంతృప్తి కలుగక మానది. రెండు సినిమాలను పోల్చకుండా సినిమా ను చూస్తే ఆర్ ఆర్ ఆర్ కూడా ఒక విజువల్ వండర్ అనడంలో సందేహం లేదు.