RRR టీమ్ కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌

Update: 2022-03-17 07:54 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌` మ‌రి కొద్ది రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానిక రెడీ అవుతోంది. గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీని మార్చి 25న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా వున్న సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. `బాహుబ‌లి` వంటి చారిత్రాత్మ‌క ఫిక్ష‌న‌ల్ మూవీ త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రం కోసం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ లు తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం కావ‌డం, అంతే కాకుండా ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ కి సంబంధించిన ఫిక్ష‌న‌ల్ స్టోరీ కావ‌డంతో పామాన్య ప్రేక్ష‌కుల‌తో పాటు దేశ భ‌క్తులు కూడా ఈ మూవీ ఎలా వుంటుందా? ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ మేక‌ర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో వ‌రల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. మ‌రి కొన్ని రోజుల్లో థియేట‌ర్లో సంద‌డి చేయ‌నున్న ఈ సినిమా గుట్టుని ఏపీ మంత్రి పేర్ని నాని విప్పేశారు.

జీఎస్టీ, ద‌ర్శ‌కుడు, న‌టీన‌టుల పారితోషికం కాకుండా ఈ చిత్రానికి 336 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టుగా చిత్ర బృందం త‌మ‌కు స‌మ‌ర్పించిన విన‌తి ప‌త్రంలో పేర్కొన్నార‌ని అస‌లు సీక్రెట్ తెలియ‌కుండానే బ‌య‌ట‌పెట్టి `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ కు షాకిచ్చారు. మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్‌` విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత డీవీవీ దాన‌య్య టికెట్ రేట్ల హైక్ విష‌య‌మై ఏపి ప్ర‌భుత్వాన్ని ఇటీవ‌ల సంప్ర‌దించారు.

ఈ విష‌య‌మై ప్ర‌భుత్వానికి స‌వివ‌రంగా ఓ విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. ఇందులో వారు వెల్ల‌డించిన విష‌యాల్ని ఏపీ ప్ర‌భుత్వం బ‌హిర్గ‌తం చేస్తుంద‌ని రాజ‌మౌళి ఊహించివుండ‌రు. అయితే వారు ఊహించ‌ని విధంగా ఏపీ మంత్ర పేర్ని నాని `ఆర్ ఆర్ ఆర్‌` బ‌ట్జెట్ గుట్టుని బ‌య‌ట పెట్ట‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గ‌త కొంత కాలంగా ఈ మూవీని దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించార‌ని, అందులోనే న‌టీన‌టుల పారితోషికాల‌ని జ‌త చేశార‌ని, వారి పారితోషికాల‌తో క‌లిపి సినిమా బ‌డ్జెట్ 400 కోట్లు అయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే నటీన‌టులు, డైరెక్ట‌ర్ పారితోషికం మిన‌హాయించి కేవ‌లం సినిమా బ‌డ్జెట్ 336 కోట్లు అయింద‌ని ఈ విష‌యాన్ని`ఆర్ ఆర్ ఆర్` టీమ్ మాకు స‌మ‌ర్పించిన విన‌తి ప‌త్రంలో పొందుప‌రిచింద‌ని మంత్రి పేర్ని నాని తాజాగా పేర్కొన‌డంతో ఆర్ ఆర్ ఆర్ సీక్రెట్ ని మంత్రి బ‌య‌ట‌పెట్టార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రాజ‌మౌళి కానీ నిర్మాత డీవీవీ దాన‌య్య కానీ ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.
Tags:    

Similar News