ఉక్రెయిన్ లో హింస‌పై చెర్రీ ఎమోష‌న‌ల్..!

Update: 2022-03-17 04:30 GMT
యుద్ధం ఎంత‌టి వినాశ‌హేతువో ఉక్రెయిన్ - ర‌ష్యా వార్ మారోసారి ప్ర‌పంచానికి నిరూపిస్తోంది. మాన‌వ‌హ‌న‌నంతో పాటు భారీగా ఆస్తుల న‌ష్టం.. తిరిగి కోలుకోలేని దారుణ స‌న్నివేశాన్ని సృష్టించింది ఈ యుద్ధం. ఎందరో చిన్నారులు వృద్ధులు మ‌హిళ‌లు దారుణ ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. భారీగా గాయ‌ప‌డిన వారి ప‌రిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది. దీనిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు సెల‌బ్రిటీలు ఎంతో హృద‌య‌వేద‌న‌ను క‌న‌బ‌రిచారు.

టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ యుద్ధంపై త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో మాట్లాడిన చ‌ర‌ణ్ దీనిపై స్పందించారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని చరణ్ ఆకాంక్షించారు. ప్రమోషన్స్ లో భాగంగా RRR  టీమ్ రెండు రోజులుగా మీడియాతో సంభాషిస్తోంది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంపై కథానాయకుడు రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింస గురించి క‌ల‌త‌కు గుర‌య్యారు.

యుద్ధం ప్రారంభమైన వెంటనే నేను ఉక్రెయిన్ నుండి వచ్చిన నా సెక్యూరిటీ ఇన్ చార్జ్ లో ఒకరిని సంప్రదించాను. అతను అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒణుకుతున్నాడు. అతను తన 85 ఏళ్ల తండ్రి చుట్టూ కాప‌లాగా తిరిగాన‌ని కూడా చెప్పాడు. చేతిలో తుపాకీతో..!`` అని రామ్ చరణ్ అక్క‌డి ప‌రిస్థితిని కూడా వివరించారు. ``అందరి మంచి కోసం హింస అంతా ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి నేను చేయగలిగినది ఆర్థిక సహాయం మాత్ర‌మే. శాంతి పునరుద్ధరించాల‌ని నేను ఆశిస్తున్నాను`` అని రామ్ చరణ్ ముగించారు.
 
అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ లో వారియ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. అత‌డు కూడా యుద్ధ వీరుడిగా బ‌రిలో క‌నిపించ‌బోతున్నాడు. RRR టీమ్ ఇటీవ‌ల‌ ఉక్రెయిన్ లో షూటింగులో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. టీమ్ అంతా అందమైన దేశం అంటూ ఉక్రెయిన్ ని అభివర్ణించారు. ఆర్.ఆర్.ఆర్ ఈనెల 25న అత్యంత క్రేజీగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

ప్రపంచ‌వ్యాప్తంగా బుకింగులు మోత‌

మోస్ట్ అవైటెడ్ #RRR రిలీజ్ కి ఇంకో 8 రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే టీమ్ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీమ్ ప్ర‌ధాన తారాగ‌ణం రాజ‌మౌళితో  క‌లిసి మీడియాతో ఇంట‌రాక్ట్ అవుతూ మూవీపై హైప్ పెంచుతూనే ఉన్నారు. అయితే ఈ అంచ‌నాల్ని అందుకునేలా ప్రీటికెట్ సేల్ కూడా అంతే ఇదిగా ఉంద‌ని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ ఇంటా బ‌య‌టా సంచ‌ల‌నంగా మార‌నుంది. తొలి రోజు తొలి వీకెండ్ రికార్డుల మోత మోగించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమాని నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా అమెరికాలో ఏకంగా 1150 లొకేష‌న్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే థియేట‌ర్ల నుంచి కన్ఫ‌ర్మేష‌న్ అందిన‌ట్టు చిత్ర‌బృందం పోస్ట‌ర్ కూడా ముద్రించి రిలీజ్ చేసింది. మార్చి 25న సినిమా రిలీజ‌వుతోంది. 24 న అమెరికాలో ప్రీమియ‌ర్లు ప‌డ‌నున్నాయి. అమెరికాలో ఇంత‌కుముందు ఎప్పుడూ విన‌నన్ని స్క్రీన్ల‌లో విడుద‌ల చేస్తున్నందుకు ఆర్.ఆర్.ఆర్ టీమ్ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.

యూరప్ లో భారీగా విడుదల

తెలుగు సినిమాకి బ‌ల‌మైన మార్కెట్ గా ఉన్న అమెరికాతో పాటు ఈసారి యూర‌ప్ లోనూ అంతే క్రేజీగా రాజ‌మౌళి త‌న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. యూఎస్ లో ఈ సినిమా ఘనంగా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్ తో పాటు యూరప్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుందని యూకేతో పాటు 30 దేశాల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఫోర్ సీజన్స్ క్రియేషన్స్ ఈ భారీ విడుదల వెనుక ప్లానింగ్ ని సాగిస్తున్నాయ‌ని స‌మాచారం. పోలాండ్ - స్వీడన్ - ఫిన్లాండ్ వంటి కొన్ని దేశాల్లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో స్క్రీన్ లలో విడుదల కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే ప్రారంభమయ్యాయి.
Tags:    

Similar News