మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సైరా నరసింహారెడ్డి సినిమా ను చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు.
సినిమా సినిమాకు మరీ ఇంత గ్యాప్ ఏంటీ బాసు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఇక మీదట వరుసగా సినిమాలు చేస్తానని చిరు హామీ ఇచ్చారు.
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తా అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన చిరంజీవి అన్నట్లుగానే ఆచార్య సినిమా ను కేవలం వంద రోజుల్లో పూర్తి చేయాలంటూ దర్శకుడు కొరటాల శివకు సూచించాడు. అతి తక్కువ సమయంలోనే ఆచార్య ను పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ భావించినా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఈ సినిమా లో ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించడంతో అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. మొదట ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ పాత్ర అనుకున్నారు. కానీ కథ డిమాండ్ మేరకు.. మెగా అభిమానులు అభిలాష మేరకు రామ్ చరణ్ పాత్రను పొడిగించడం జరిగింది.
రామ్ చరణ్ కు జోడీగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఉందంటే ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న ఈ సమయంలో ఆసక్తికర విషయం ఒకటి ప్రచారం జరుగుతోంది. అదేంటీ అంటే.. ఆచార్య సినిమా దాదాపు మూడు గంటలకు పైగా రన్ టైమ్ ఉంటుందట. ఇద్దరు హీరోలను.. అది కూడా తండ్రి కొడుకులను ఒకే సినిమాలో ఎక్కువ సమయం చూసే అవకాశం మూడు గంటల టైం తో మెగా అభిమానులు దక్కబోతుందనే ఆనందం వ్యక్తం అవుతోంది.
ఆచార్య సినిమా లో ఇద్దరు మెగాస్టార్ లు ఉండటం వల్ల ఖచ్చితంగా ఎక్కువ రన్ టైమ్ ఉంటేనే బావుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తక్కువ రన్ టైం లో ఇద్దరు హీరోలకు కూడా పూర్తిగా న్యాయం చేసే విధంగా సన్నివేశాలు ఉండవు. కనుక సినిమాలో వారిద్దరిని ఎక్కువ సేపు సమయం చూసే అవకాశం ఉంటుందని అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య మూడు గంటలకు ఎక్కువైనా పర్లేదు తక్కువ ఉండకూడదు అంటూ అభిమానులు దర్శకుడు కొరటాల శివ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆచార్య సినిమా ఏప్రిల్ 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటించారు. సినిమాలో సంగీత కీలక పాత్రలో కనిపించబోతుంది.
నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ మరియు చిరంజీవి లు కనిపిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిపోయాయి. మరి దర్శకుడు కొరటాల శివ ఏ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించాడు అనేది చూడాలి.