దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల 'గంగుబాయి' అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అలియా.. RRR సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రూపొందుతున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఇందులో చరణ్ కు జోడీగా సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో అలియా లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లేటెస్టుగా వచ్చిన 'ఎత్తర జెండా' పాటలో స్టెప్పులతో అలరించింది. RRR మూవీ ఈ నెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆలియాని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
మంగళవారం అలియా భట్ పుట్టినరోజు కావడంతో.. శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్ డేట్లు అందించారు. 'బ్రహ్మస్త్ర' సినిమా నుంచి అలియా లుక్ తో పాటుగా ఆమె పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ని మేకర్స్ విడుదల చేశారు.
కానీ నిన్న రాత్రి వరకు 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ నుంచి ఎలాంటి సందడీ లేదు. 'బ్రహ్మాస్త్ర' బృందం ఉదయమే విషెస్ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేయగా.. ట్రిపుల్ ఆర్ యూనిట్ మాత్రం తీరిగ్గా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఓ పోస్టర్ వదిలింది.
హీరో రామ్ చరణ్ సైతం అదే సమయంలో RRR సీతకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలియా మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరని పేర్కొన్నారు. ఇక మరో హీరో ఎన్టీఆర్ అయితే లేట్ గా కూడా ఒక ట్వీట్ చేయలేదు.
సాధారణంగా చిత్ర బృందంలో ఎవరి పుట్టిన రోజు వచ్చినా, స్పెషల్ పోస్టర్ తో RRR విషెస్ చెబుతూ ఉంటారు. కానీ అలియా బర్త్ డేని నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'ఎత్తర జెండా' పాట సందర్భంలో అయినా శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేయలేదు.
అయితే దానికి కారణం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లకు అలియా భట్ డుమ్మా కొట్టడమే అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే అడిగినంత రెమ్యూనరేషన్ చెల్లించినా.. ప్రచారంలో ఆమెకు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో ఈసారి ప్రమోషన్స్ కు పిలవలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే అలియా బర్త్ డే వచ్చినా చిత్ర బృందం పట్టించుకోలేదని టాక్.
మరోవైపు అమ్మడి చుట్టూ ఉన్న నెగిటివిటీ RRR చిత్రంపై పడుతుందేమో అని కావాలనే మేకర్స్ అలియాని ఎక్కువగా ప్రమోట్ చేయడం లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అలియా భట్ ను నెపోటిజం పేరుతో నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అలియా నటించిన 'సడక్ 2' ట్రైలర్ డిస్ లైక్స్ తో ప్రపంచంలో చెత్త రికార్డ్ క్రియేట్ చేసేలా చేసారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం IMDBలో 1/10 రేటింగ్ పొందేలా చేశారు. ఇటీవల వచ్చిన 'గంగూబాయి' చిత్రానికి బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వచ్చినా.. అలియా భట్ అద్భుతంగా నటించిందని ప్రశంసలు దక్కినా ఐఎండీబీలో రేటింగ్ మాత్రం 3.7/10 గా ఉంది.
దీనిని బట్టి అలియా భట్ పై ఇంకా వ్యతిరేఖత వ్యక్తం అవుతోందని అర్థం అవుతుంది. దీంతో త్వరలో రాబోయే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై ఈ ప్రభావం పడుతుందేమో అని టాలీవుడ్ సినీ అభిమానులు కలవరపడుతున్నారు. అదే సమయంలో రాజమౌళి ఈ పాన్ ఇండియా మూవీతో అలియా పై నార్త్ ఆడియన్స్ లో ఉన్న ద్వేషాన్ని ప్రతికూలతను తొలగిస్తారని నమ్ముతున్నారు.