పురుషాధిక్యంపై మ‌రో హీరోయిన్ క‌న్నెర్ర‌!

Update: 2022-03-17 17:30 GMT
ఏ ప‌రిశ్ర‌మ‌లోనైనా హీరోల‌కే డిమాండ్. కోట్లాది మంది అభిమానుల్ని క‌లిగి ఉండేది కేవ‌లం హీరోల‌కే. శాశ్వ‌త అభిమానం చూపించేది హీరోలపైనే. కోట్ల రూపాయ‌ల పారితోషికాలు అందుకునేది హీరోలే. ఆ నెంబ‌ర్ మార్కెట్ ని బ‌ట్టి..ఇమేజ్ని బ‌ట్టి మారుతుంది. ప‌రిశ్ర‌మ‌లో పురుషాధిక్యం అన్న‌ది స‌హ‌జం. హీరోయిన్ల‌కు అభిమానులుంటారు. కానీ శాశ్వ‌త అభిమానం చూపించేది కొంద‌రిపైనే. అలాంటి వాళ్ల‌కే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో న‌టించే అవ‌కాశం ఉంటుంది.

వాళ్లు సైతం స్టారు హీరోల దగ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి త‌గ్గాల్సిందే. మేక‌ర్స్ ఆ విధంగానే హీరోయిన్ల పాత్ర‌ల్ని డిజైన్ చేస్తారు. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన్ని ద‌శాబ్ధాలుగా వ‌స్తోన్న ఆచారం లాంటి విధానం ఇది. ఈ విధానంపై ఫైర్  బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ చాలాసార్లు క‌న్నెర్ర‌జేసి గ‌ళ‌మిప్పింది. సినిమాల్లో త‌మ‌కి హీరోల‌తో పాటు స‌మాన పారితోషికాలు..పాత్రలు కల్పించాల‌ని..హీరోలకి ధీటుగా మేము ఎందులో త‌క్కువ‌ని ప్ర‌శ్నించిన సంద‌ర్భ‌లు కోకొల్ల‌లు. పురాషాధిక్య ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లు అంతా అణ‌గారిన వ‌ర్గంలోకి వెళ్లిపోతున్నార‌ని మండిప‌డింది.

ఆ త‌ర్వాత దీపికా ప‌దుకొణే...ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లు సైతం ఇదే త‌ర‌హాలోనే త‌మ బాణీని వినిపించే ప్ర‌య‌త్నం చేసారు. హీరోయిన్లు  అంటే కేవ‌లం అందాల ప్రద‌ర్శ‌న‌కే ప‌రిమితం కాద‌ని..న‌ట‌న‌లోనూ హీరోల‌కు ధీటుగా రాణిస్తామ‌ని ప‌లువురు హీరోయిన్లు సంద‌ర్భం దొరిక‌న‌ప్పుడ‌ల్లా ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేసారు.

కేవ‌లం పురుషులు హీరోలు అయితేనే ప్రేక్ష‌కులు సినిమాలు చూస్తార‌ని భావించే ప‌రిశ్ర‌మ‌లు హీరోల్ని అలా త‌యారు చేస్తున్నాయి. మ‌రి అదే ప‌రిశ్ర‌మ‌ త‌మ‌నెందుకు అలా త‌యారు చేయ‌డం లేద‌ని మండిపడిన వారు ఉన్నారు.

తాజాగా  మ‌రో బాలీవుడ్ న‌టి కృతిస‌న‌న్ ఇదే విష‌యంపై క‌త్తికి తేనే పూసిన‌ట్లు స్పందించింది. "సాధార‌ణంగా హీరోయిన్ల పాత్ర‌లు అర‌వైశాతం న‌ట‌న‌కు ఆస్కారం ఉందంటే హీరోలు త‌మ‌తో క‌లిసి న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. పురుషాధిక్య ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది హీరోలు ఇలాగే ఉన్నారు. హీరోయిన్లు క‌న్నా హీరోలు ఎప్పుడు మెరుగైన స్థానంలో ఉండాల‌నే కోరుకుంటారు. ఆ విధంగానే ఆలోచిస్తారు. అందులో  ఎక్క‌డ తేడా జ‌రిగినా హీరోయిన్ పై ఆ ప్ర‌భావం ప‌డుతుంది. ఈ విష‌యంలో కొంచెం అంద‌రూ మారాలి" అని సూచించింది.

ప్ర‌స్తుతం ఈ భామ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న 'ఆత్రంగిరే విన్' అనే చిత్రంలో న‌టిస్తోంది.  ఇందులో అక్ష‌య్ నిజాయితీగా త‌న పాత్రని పోషిస్తున్నాడ‌ని కృతి తెలిపింది. వాస్త‌వానికి ఈ సినిమాలో కృతి స‌న‌న్ పాత్ర చాలా చిన్న‌దే అన్న విష‌యాన్ని గ‌మ‌నించాలి. కృతి స‌న‌న్ తెలుగు ఆడియ‌న్స్ కి సుప‌రిచితురాలే. మ‌హేష్ స‌ర‌స‌న 'వ‌న్'.. నాగ‌చైత‌న్య‌తో 'దోచెయ్' లాంటి చిత్రాల్లో కృతి స‌న‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News