ఇండస్ట్రీలో ఒక్క హిట్టు వంద ప్రశ్నలకు సమాధానం చెబుతుంటుంది. అందుకే ఒక్క ఛాన్స్ అని అంతా ఎదురుచూస్తుంటారు. ఒక్క ఛాన్స్ దొరికితే తమని తాము నిరూపించుకుని స్టార్ లుగా వెలిగిపోతుంటారు. అందుకే ఇక్కడ రాత్రి రాత్రే జీవితాలు మారిపోతుంటాయి. అంత వరకు పెద్దగా ఫేమ్ లేని వారు ఒక్క హిట్టు పడితే స్టార్ లుగా మారి అందనంత ఎత్తుకు చేరుకుంటుంటారు. ఇది ఇక్కడ సర్వసాధారణం. అయితే ఓ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఒక్క హిట్టు ప్లీజ్ అంటున్నాడు. ఆయనే శ్రీకాంత్ అడ్డాల.
'కొత్త బంగారు లోకం' సినిమాతో దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఈ మూవీ తరువాత ఇద్దరు స్టార్ హీరోలతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి భారీ మల్టీస్టారర్‌ని తెరకెక్కించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించారు. అలాంటి దర్శకుడి కెరీర్ 'బ్రహ్మాత్సవం' తరువాత గాడి తప్పింది. ఎటు వెళ్లాలో.. ఏం చేయాలతో తెలియని ఆయోమయ స్థితిలోకి నెట్టేసింది.
విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' చిత్రం చేసినా అది రీమేక్ కావడంతో ఆ క్రెడిట్ మొత్తం వెంకటేష్ కే వెళ్లింది. దాంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఆలోచనలో పడ్డారట. ఈ నేపథ్యంలో చిన్న సినిమా చేసి దాన్ని హిట్ గా మలిచి తానేంటో నిరూపించుకోవాలని, ఆ తరువాత మరో భారీ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆయన ఓ స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ ప్రేమకథా చిత్రాన్ని చేయబోతున్నారట.
ఇటీవల బాలకృష్ణతో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి త్వరలో తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారట. ఆ బాధ్యతల్ని తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారని తెలిసింది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. వన్స్ స్టోరీ కంప్లీట్ కాగానే పవర్ ఫుల్ లవ్ స్టోరీని మిర్యాల రవీందర్ రెడ్డి తనయుడితో పట్టాలెక్కిస్తారని తెలిసింది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత శ్రీకాంత్ అడ్డాల భారీ మల్టీస్టారర్ ని చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. దీనికి 'అన్నాయ్' అనే టైటిల్‌ని కూడా ఫైనల్ చేసుకున్నారని, ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు.
అయితే ముందు ఓ హిట్టు కొట్టాకే ఈ మల్టీస్టారర్ ని తెరపైకి తీసుకురావాలని శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నారని తెలిసింది.