ఎన్టీఆర్ .. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి అదే దూకుడును కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఆ తరువాత సినిమాను ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు క్రితం నెల 7వ తేదీన మొదలుకావలసి ఉంది. కానీ ఆ తేదీ వాయిదా పడింది. అందుకు అటు ఎన్టీఆర్ వైపు నుంచి .. ఇటు కొరటాల వైపు నుంచి బలమైన కారణాలు లేకపోలేదు.
'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక కొరటాల 'ఆచార్య' కూడా విడుదల తేదీలను మార్చుకుంటూ వచ్చింది. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతుండటమే ఇందుకు కారణం.
ఆ సినిమాలు ఒక గట్టుకు చేరితేనే తప్ప కొత్త ప్రాజెక్టు పైకి ఎన్టీఆర్ - కొరటాల వెళ్లలేరు. అందువలన ఇద్దరూ కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. ఇక ఇటీవల మొదలుపెడదామని అనుకుంటే, 'గంగూబాయి కతియావాడి' ప్రమోషన్స్ లో అలియా భట్ బిజీగా ఉండటం వలన, కొరటాల ఏమీ చేయడానికి లేకపోయింది.
పోనీ అటు 'గంగూబాయి' థియేటర్స్ కు వచ్చింది .. ఈ నెల 25న 'ఆర్ ఆర్ ఆర్' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది గనుక, ఏప్రిల్ లో అయినా ఎన్టీఆర్ 30వ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అంటే అందుకు అవకాశమే లేదు.
ఎందుకంటే ఏప్రిల్ 29వ తేదీన 'ఆచార్య' రిలీజ్ ఉంది. చిరంజీవితో పాటు చరణ్ .. కాజల్ .. పూజ హెగ్డే .. సోనూ సూద్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ప్రమోషన్స్ వచ్చే నెల మొదటివారం నుంచి మొదలవుతాయి. అందువలన కొరటాల అందుబాటులో ఉండడు. కనుక ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మే 2వ వారం నుంచి ఉండొచ్చని అనుకుంటున్నారు.
ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో గతంలో 'జనతా గ్యారేజ్' వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. అవినీతి రాజకీయాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం అలియా భట్ ను ఎంపిక చేసుకున్నారు.
సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకున్నారు. అప్పుడే ఆయన తన పనులను మొదలెట్టేశాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం కావడంతో ఇంకా ఎప్పుడు ఎన్టీఆర్? అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా 'ఆర్ ఆర్ ఆర్' తరువాత తన స్పీడ్ మరింత పెంచే పనిలోనే ఉన్నాడని టాక్.