#రాధేశ్యామ్.. పంపిణీదారు ఎగ్జిబిట‌ర్ బ్లాక్ దందా?

Update: 2022-03-11 03:17 GMT
ఆన్ లైన్ టికెటింగ్ మ‌ర్మం ఏంటో ఇప్ప‌టివ‌ర‌కూ ఆడియెన్ కి తెలీనే తెలీదు. టికెట్ అందుబాటులో ఉంటే బుక్ చేసుకోవ‌డం లేదంటే లైట్ తీస్కోవ‌డం త‌ప్ప‌. దీనికి కార‌ణం బ్లాక్ దందా అంటూ తెలిసిన వారు చెబుతుంటారు.

ఆన్ లైన్ లో టికెట్లు అమ్మ‌కుండా బ్లాక్ లో థియేట‌ర్ య‌జ‌మానులే అమ్మేస్తుంటార‌ని పంపిణీ వ‌ర్గాల‌తో కుమ్మ‌క్క‌య్యి సాగే వ్య‌వ‌హార‌మిద‌ని తీవ్ర‌మైన కంప్లైంట్లు ఉన్నాయి.

దీనిపై సినీపెద్ద‌ల్లోనే చ‌ర్చ సాగింది. ప్ర‌భుత్వం కూడా సినీపెద్ద‌ల‌తో ఈ వ్య‌వ‌హారంపై మాటా మంతీ  సాగించింది. అదంతా అలా ఉంటే ఇప్పుడు రాధేశ్యామ్ టికెట్ల‌ను బుక్ చేసేందుకు రాజ‌మండ్రి లాంటి చోట్ల బుక్ మై షో వంటి వాటిని ట్రై చేస్తే నిరాశే ఎదురైంది.

ఈరోజు రాధేశ్యామ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఘ‌నంగా రిలీజ‌వుతుంటే ఏపీలో టూటైర్ సిటీలో టికెట్లు దొర‌క్క‌పోవ‌డ‌మేంటో అర్థం కావ‌డం లేదని ప‌లువురు నిరాశ చెందుతున్నారు.

10 మార్చి 7 పీఎం బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేందుకు ట్రై చేసినా కుద‌ర‌లేదు. పేటీఎంలో ఒకే ఒక్క థియేట‌ర్ కి మాత్ర‌మే బుక్ చేసుకునే ఛాన్సు ఉన్నా అక్క‌డా టిక్కెట్లు క‌నిపించ‌లేదు. టిక్కెట్లు అమ్మ‌కుండానే  దాచేసార‌ని భావించాల్సి వ‌చ్చింది. ఈ బుక్ మైషోకి ఏమైంది?  అంటూ అంతా నిరాశ‌చెందారు.

అయితే దీనంత‌టికీ కార‌ణ‌మేంటి?  ఇంకా టిక్కెట్లు ధ‌ర‌ల‌పై క్లారిటీ లేక‌నా .. ఎక్స్ ట్రా షోల విష‌యంలో స్ప‌ష్ఠ‌త క‌రువ‌డిందా? అన్న‌ది తెలియ‌ని ప‌రిస్థితి. కామ‌న్ ఆడియెన్ సినిమా చూడాలి అంటే ఇలా అయితే ఎలా?  టికెట్ కోసం ఎక్క‌డికి వెళ్లాలి.  టికెట్ ధ‌ర‌లు పెంచుకోమ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం జీవోనే ఇచ్చింది.

ఆ ధ‌ర‌లు స‌రిపోవ‌డం లేదా? మ‌ళ్లీ య‌థావిధిగా బ్లాక్ దందాను కొన‌సాగించేందుకే ఇలా చేస్తున్నార‌ని భావించాలా?  సినిమా మార్కెట్ ఎప్ప‌టికీ అర్థం కాని ఫ‌జిల్ అనుకోవాలా? విక్ర‌మార్కా తెలిసీ స‌మాధానం చెప్ప‌క‌పోయావో నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌గును!
Tags:    

Similar News